పెళ్లి తర్వాత ఏడాదిన్నర పాటు గొడవలు జరిగాయని నటి మధుమిత వెల్లడించారు. కొడుకు పుట్టిన తర్వాత కూడా గొడవలు జరుగుతుండటంతో విడిపోయే స్థితికి వచ్చామని శివబాలాజీ చెప్పుకొచ్చారు. వీరిద్దరు తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్ని అనేక ఆసక్తికరమైన విషయాలు వెల్లడించారు.
టాలీవుడ్ ఇండస్ట్రీలోని స్వీట్ కపుల్ లో శివ బాలాజీ, మధుమిత జంట ఒకటి. వీరిద్దరు అనేక చిత్రాల్లో నటించి మెప్పించారు. వీరిద్దరు ఓ సినిమా షూటింగ్ సమయంలో పరిచయం ఏర్పడింది. అది కాస్తా స్నేహంగా మారి.. చివరకు ప్రేమకు దారితీసింది. అయితే వారు పెద్దలను ఒప్పించి.. 2009 పెళ్లి చేసుకున్నారు. పెళ్లి తర్వాత ఏడాదిన్నర పాటు గొడవలు జరిగాయని నటి మధుమిత వెల్లడించారు. కొడుకు పుట్టిన తర్వాత కూడా గొడవలు జరుగుతుండటంతో విడిపోయే స్థితికి వచ్చామని శివబాలాజీ చెప్పుకొచ్చారు. తాజాగా సుమన్ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో వీరిద్దరు పాల్గొన్ని.. వారికి సంబంధించిన పలు విషయాలను షేర్ చేసుకున్నారు.
సుమన్ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో శివబాలాజీ, మధుమిత..తమకు సంబంధించిన అనేక సినీ, వ్యక్తిగత విషయాలను షేర్ చేసుకున్నారు. వారి ప్రేమను గెలిపించుకునేందుకు ఎన్ని ఇబ్బందులు పడ్డారో.. పెళ్లి అనంతరం ఎలాంటి గొడవలు జరిగాయి వంటి విషయాలను వారు వెల్లడించారు. ఇక మధుమిత మాట్లాడుతూ..” ప్రతి ఒక్కరు అనుకుంటారు.. పెళ్లి అనేది చాలా ఈజీ అని. అయితే పెళ్లి అనేది అంత సులభం కాదు. పెళ్లైన తరువాత ఏడాదిన్నర పాటు మేమిద్దరం గొడవ పడుతునే ఉండే వాళ్లం” అని తెలిపారు.
శివబాలాజీ మాట్లాడుతూ..” పెళ్లికి ముందు వేరు వేరుగా ఉన్నప్పుడు అన్ని బాగానే ఉన్నాయి. ఇద్దరం కలిసి ఓకే ఇంట్లో ఉన్నప్పుడు ఆలోచనలు పంచుకునే క్రమంలో అభిప్రాయ బేధాలు వస్తాయి. నేను వచ్చేసి.. ఎప్పుడు బయటి వెళ్లి.. ఫ్రెండ్స్ తో తిరగాలనుకునే వాడిని. మధుమిత మాత్రం.. ఎప్పుడు ఇంట్లోనే ఉంటుంది. నిర్ణయాలు కూడా వాళ్ల నలుగురే తీసుకునే వాళ్లు. నేను వెళ్లినప్పుడు కొన్ని నిబంధనలు పెట్టే వాళ్లు. అవి నాకు అసౌకర్యంగా ఉండేవి. అవి చివరకు గొడవలకు దారి తీసేవి. అవి ఒకానొక దశలో విడిపోయే స్థితికి వచ్చాము. బాబు పుట్టిన తరువాత కూడా మా మధ్య గొడవలు బాగా జరిగాయి.
చివరకు ఇక విడిపోయేందుకు సిద్ధమయ్యాము. అలాంటి సమయంలో మా కజిన్ ఒకరు వచ్చి.. కొన్నాళ్లు మీరిద్దరు వేరు వేరుగా ఉండండని సలహా ఇచ్చారు. అలా కొన్నాళ్ల పాటు ఇద్దరు ఎవరి ఇంట్లో వాళ్ళం దూరంగా ఉన్నాము. అయితే ఒకరినొక్కరం బాగా మిస్సవుతున్నాము. కానీ మాట్లాడుకునేందుకు ఇద్దరి మధ్య యుగో అడ్డు వచ్చేది. చివరకు మళ్లీ ఇద్దరు కలిసి పోయాము. అర్ధం చేసుకునే విధానం, గౌరవం ఉంటేని అలాంటి బంధాలు బలంగా ఉంటాయి” శివ బాలాజీ తెలిపారు. మరి.. శివబాలాజీ, మధుమిత చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.