తమిళ ఇండస్ట్రీలో బాల నటుడిగా ఎంట్రీ ఇచ్చి స్టార్ హీరోగా ఎదిగిన శింబు కొందరు కావాలని తనను ఇబ్బందులకు గురిచేస్తున్నారంటూ కన్నీరు పెట్టుకున్నారు. వెంకటేశ్ ప్రభు దర్శకత్వంలో శింబు హీరోగా నటించిన తాజా చిత్రం ‘మానాడు’ ఈ నెల 25న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో చెన్నైలో మీడియా సమావేశం నిర్వహించారు మేకర్స్. ఈ సందర్భంగా హీరో శింబు మాట్లాడుతూ.. వెంకట్‌ప్రభు, తాను కలిసి సినిమా చేయాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నామని, అయితే ఆయన మరొకరితో ఒప్పందం చేసుకోవడంతో ఆలస్యం అయిందన్నారు.
‘మానాడు’ సినిమాలో వినోదానికి కొదవ ఉండదని, ఈ సినిమా కోసం ఎంతో శ్రమించానని చెప్పాడు. ఇక ఈ సినిమాలో ఎజ్‌జే సూర్య నటన అద్భుతంగా ఉంటుందని శింబు పేర్కొన్నాడు. అంతేందుకు ఈ సినిమా విడుదల తర్వాత తన మరో స్థాయికి వెళ్తుందన్నాడు. అప్పటి వరకు స్టేజ్ పై సరదాగా మాట్లాడిన శింబు ఒక్కసారే కన్నీటి పర్యంతం అయ్యారు.
తనని కొందరూ టార్గెట్ చేశారని, కావాలని ఇబ్బందులకు గురిచేస్తున్నారంటూ చెప్పుకొచ్చాడు. అయితే తనకు ఫ్యాన్స్ సపోర్ట్ ఉందని.. ఆ సమస్యల సంగతి తాను చూసుకుంటానని, తన సంగతిని మాత్రం అభిమానులు చూసుకోవాలని కోరారు. శింబు కన్నీళ్లు పెట్టుకోవడంతో వేదికపై ఉన్న భారతీరాజా, ఎస్ఏ చంద్రశేఖర్, ఎస్‌జే సూర్య, నిర్మాత కె.రాజన్ తదితరులు ఆయనను ఓదార్చారు.