సాధారణంగా ఇండస్ట్రీలో హీరోలు, హీరోయిన్ లు కెరీర్ మీద దృష్టి పెట్టి పెళ్లి అనే బంధాన్ని దూరం పెడుతున్నారు. ముఖ్యంగా టాలీవుడ్ లో చాలా మంది పెళ్లి వయసు వచ్చినా గానీ ఇంకా పెళ్లి చేసుకోకుండా అలానే బ్రహ్మచారిగా ఉంటున్నారు. అలా టాలీవుడ్ లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ఎవరైనా ఉన్నారా అంటే.. వారిలో ముందుగా చెప్పుకునే పేరు రెబల్ స్టార్ ప్రభాస్.పెళ్లిపీటలెక్కబోతున్న శర్వానంద్! పెళ్లి కూతురు ఎవరంటే..ఆ తర్వాత హీరో శర్వానంద్ అనే చెప్పుకోవాలి. అయితే తాజాగా బాలకృష్ణ హోస్ట్ గా వ్యవహరిస్తున్న అన్ స్టాపబుల్ సీజన్ 2లో పాల్గొన్న శర్వానంద్.. పెళ్లి గురించి ఓ స్టేట్ మెంట్ పాస్ చేసిన విషయం మనందరికి తెలిసిందే. అయితే ఈ క్రమంలోనే త్వరలోనే శర్వానంద్ పెళ్లి చేసుకోబోతున్నడన్న వార్త ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతోంది.
శర్వానంద్.. టాలీవుడ్ లో తనదైన కథల ఎంపికతో దూసుకెళ్తున్నాడు. ఇటీవలే టైమ్ ట్రావెల్ బ్యాక్ డ్రాప్ లో వచ్చిన ‘ఒకే ఒకజీవితం’ తో మంచి సక్సెస్ ను అందుకున్నాడు. ఇక ఎప్పటి నుంచో శర్వానంద్ ను ఎక్కడికి వెళ్లినా అడుగుతున్న ఏకైకక ప్రశ్న శర్వా నీ పెళ్లెప్పుడు అని. బాలయ్య టాక్ షోలో ప్రభాస్ తర్వాతే నా పెళ్లి అన్న శర్వానంద్.. గురించి తాజాగా ఓ వార్త ఫిల్మ్ నగర్ లో చక్కర్లు కొడుతోంది. అదేంటంటే ఓ సాఫ్ట్ వేర్ అమ్మాయితో త్వరలోనే శర్వా జతకట్టబోతున్నాడని. ఆ అమ్మాయి శర్వానంద్ గత కొంత కాలంగా ప్రేమించుకుంటున్నారని వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే తమ ప్రేమను పెద్దలకు చెప్పి వారిని పెళ్లికి ఒప్పించి త్వరలోనే పెళ్లిచేసుకోబోతున్నాడట శర్వానంద్. ఇక ఆ అమ్మాయి అమెరికాలో సాఫ్ట్ వేర్ ఇంజినీర్ గా వర్క్ చేస్తుందట. కరోనా కారణంగా ప్రస్తుతం హైదరాబాద్ లోనే ఉంటూ.. వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తుందని సమాచారం. త్వరలోనే ఆ అమ్మాయి వివరాలు, పెళ్లికి సంబంధించిన ప్రకటన వెలువడుతుందని పరిశ్రమలో వినికిడి. మరి శర్వానంద్ తన పెళ్లిపై వస్తున్న వార్తలపై ఎలా రియాక్ట్ అవుతాడో చూడాలి. ప్రస్తుతం శర్వా పలు సినిమాలతో బిజీగా ఉన్నాడు.