ఇటీవల టాలీవుడ్ ఇండస్ట్రీలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్న విషయం తెలిసిందే. గత ఏడాది సినీ దిగ్గజ నటీ,నటులు కన్నుమూశారు. ఈ ఏడాది కూడా వరుసగా సినీ ప్రముఖులు కన్నుమూస్తున్నారు.
ఇటీవల సినీ ఇండస్ట్రీలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. సినీ ప్రముఖులు, దర్శక, నిర్మాతలు వరుసగా కన్నుమూస్తున్నారు. తాము ఎంతగానో అభిమానించే నటీ,నటులు చనిపోవడంతో అభిమానులు సైతం శోక సంద్రంలో మునిగిపోతున్నారు. ప్రముఖ నటుడు శరత్ బాబు కన్నుమూశారు. దీంతో ఇండస్ట్రీ ఒక్కసారే విషాదంలో మునిగిపోయింది. వివరాల్లోకి వెళితే..
తెలుగు ఇండస్ట్రీలో మరో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ నటుడు శరత్‌బాబు(71) కన్నుమూశారు. నెలరోజులకు పైగా ఎంజీఎం ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మే,22 సోమవారం తుది శ్వాస విడిచారు. గత కొంత కాలంగా ఆయన ఆనారోగ్యంతో బాభపడుతున్నారు. ఈ క్రమంలో శరత్‌బాబు బెంగుళూరు లో చికిత్స తీసుకున్నాడు. అయినప్పటికీ ఆయన ఆరోగ్యం మెరుగు పడకపోవడంతో కుటుంబ సభ్యులు మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ లోని ఏఐజీ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మొదట ఆయన ఆరోగ్యం కుదుట పడినప్పటికీ.. ఇతర సమస్యలు తలెత్తడంతో శరత్ బాబు ఆరోగ్యం పూర్తిగా క్షీణించిపోయి కన్నుమూశారు.
ఇక సినిమా విషయానికి వస్తే.. శరత్‌బాబు అసలు పేరు సత్యం బాబు దీక్షితులు. సినీ ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత ఆయన పేరు శరత్‌బాబు గా మార్చుకున్నారు. 1951 జులై 31న ఆంధ్రప్రదేశ్ లోని ఆముదాలవలసలో జన్మించారు. తమిళ, తెలుగు, కన్నడ సినీ రంగాలలో ఎన్నో అద్భుతమైన చిత్రాల్లో నటించి తనకంటూ ప్రత్యేక ఇమేజ్ సొంతం చేసుకున్నాడు. 1973 ‘రామరాజ్యం’ మూవీతో సినీ పరిశ్రమలోకి అడుగు పెట్టారు. ఇప్పటి వరకు ఆయన పలు భాషల్లో సుమారు 220 కి పైగా చిత్రాల్లో నటించారు. కెరీర్ బిగినింగ్ లో విలన్ పాత్రల్లో నటించి తర్వాత హీరోగా పలు చిత్రాల్లో నటించారు. ఆ తర్వాత విభిన్నమైన క్యారెక్టర్ పాత్రల్లో నటిస్తూ ప్రేక్షకులను అలరించారు. సీతాకోక చిలుక(1981) , ఓ భార్య కథ(1988), నీరాజనం (1989) మూడు చిత్రాల్లో ఉత్తమ సహాయ నటుడిగా నంది పురస్కారాన్ని అవార్డు కైవసం చేసుకున్నారు. ఆయన కెరీర్ లో ఎన్నో అవార్డులు.. రివార్డులు సొంతం చేసుకున్నారు.
శరత్‌బాబు రామరాజ్యం చిత్రం తర్వాత వచ్చిన కన్నెవయసు చిత్రంలో నటించారు. ఆ తర్వాత పలు చిత్రాల్లో ప్రతినాయకుడి పాత్రల్లో నటించారు. ప్రముఖ దర్శకులు బాలచందర్ దర్శకత్వంలో వచ్చిన ‘చిలకమ్మ చెప్పింది’ మూవీ శరత్‌బాబు కి మంచి పేరు తీసుకు వచ్చింది. మూడుముళ్ల బంధం, సీతాకోక చిలుక, సంసారం ఒక చదరంగం, అన్నయ్య, ఆపద్భాందవుడు ఇలా ఎన్నో సూపర్ డూపర్ హిట్ చిత్రాల్లో నటించారు శరత్ బాబు. ఆయన నటనతో కోట్ల మంది అభిమానం సంపాదించిన శరత్‌బాబు ఇండస్ట్రీకి దూరం అయ్యారన్న విషయం తెలుసుకొని ఇండస్ట్రీ ప్రముఖులే కాదు.. అభిమానులు సైతం శోక సంద్రంలో మునిగిపోయారు. ఆయనకు నివాళులర్పిస్తున్నారు.