ఈ మధ్యకాలంలో సినీ నటులు అనారోగ్యం పాలవుతున్నారు. వృద్ధాప్యం కారణంగా కొందరు, వివిధ కారణాలతో మరికొందరు అనారోగ్యానికి గురవుతున్నారు. తాజాగా సీనియర్ నటుడు శరత్ బాబు అనారోగ్యానికి గురైనట్లు తెలుస్తోంది.
సీనియర్ నటుడు శరత్ బాబు గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. హీరోగా, విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఆయన మంచి గుర్తింపు పొందారు. తెలుగుతో పాటు తమిళం, కన్నడ సినిమా పరిశ్రమల్లోనూ ఎన్నో సినిమాలో నటించి.. మంచి నటుడిగా పేరు సంపాదించారు. కొన్నేళ్లు పాటు వెండితెరపై కనిపించి సందడి చేసిన శరత్ బాబు ఇటీవల చాలా తక్కువగా కనిపిస్తున్నారు. ప్రస్తుతం ఆయన చెన్నైలో నివాసం ఉంటున్నారు. అయితే ఆయన అనారోగ్యానికి గురయ్యారని తెలుస్తోంది. పలువురు సినీ ప్రముఖులు ఆస్పత్రికి వెళ్లి ఆయనను పరామర్శించారు.
శరత్ బాబు సుమారు 2 వేలకు పైగా సినిమాల్లో నటించాడు. తను ఏ క్యారెక్టర్ చేసినా అందులో లీనమై నటించే వాడు శరత్ బాబు. 1973లో రామరాజ్యం సినిమా ద్వారా టాలీవుడ్ ఇండస్ట్రీలో అడుగు పెట్టాడు. ఆ తర్వాత కన్నడ మూవీలో నటించాడు. ఆ తరువాత సింగీతం శ్రీనివాసరావు డైరెక్షన్ లో పంతులమ్మ అనే సినిమా చేశాడు. ఆ తరువాత అమెరికా అమ్మాయి సినిమాలో నటించారు. ఈ సినిమా తర్వాత బాలచందర్ దర్శకత్వంలో చిలకమ్మ చెప్పింది సినిమాలో నటించారు.
చేశాడు.అలానే ఆయన మూడుసార్లు ఉత్తమ సహాయ నటుడిగా నంది అవార్డు అందుకున్నారు. కొన్నాళ్ల క్రితం వరకు కూడా శరత్ బాబు పలు సినిమాల్లో కనిపించేవారు. తండ్రి పాత్రలతో పాటు పలు ఇతర పాత్రలు చేస్తూ ప్రేక్షకులను అలరించే వాడు. అయితే వృద్ధాప్యం కారణంగా సినిమాల్లో అరుదుగా కనిపిస్తున్నారు. ఆయన ప్రస్తుతం చెన్నైలో ఆయన నివాసంలో ఉంటున్నారు. ఈ క్రమంలోనే అనారోగ్యానికి గురైనట్లు తెలుస్తోంది. పలువురు సినీ ప్రముఖులు ఆయన క్షేమంగా ఉండాలని దేవుడిని ప్రార్థించారు.
నటి కరాటే కళ్యాణి సైతం శరత్ బాబు కోలుకోవాలని దేవుడిని ప్రార్థించారు. అదే విషయాన్ని సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు. “నాకు ఇష్టమైన హీరో అప్పట్లో అమ్మాయిల కలల రాకుమారుడు శరత్ బాబు గారు తొందరగా కోలుకోలవాని మనం స్వామిని వేడుకొందాం” అంటూ ఆమె పోస్ట్ చేశారు. మరి.. శరత్ బాబు ఆరోగ్యంగా ఉండాలని మీ ప్రార్థనలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.