సీనియర్ నటుడు శరత్ బాబు అనారోగ్య సమస్యలతో బాధ పడుతూ సోమవారం మరణించిన విషయం అందరికి తెలిసిందే. ఓ ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స పొందుతూ మరణించారు. ఈ నేపథ్యంలో తన సోదరి సోదరుల పిల్లలకు దాదాపు 13 వాటాల ఆస్తులను పంచనున్నట్లు తెలుస్తోంది.
సీనియర్ నటుడు శరత్ బాబు అనారోగ్య సమస్యలతోబాధపడుతూ సోమవారం మరణించిన విషయం అందరికి తెలిసిందే. ఓ ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స పొందుతూ మరణించారు. కొంతకాలం నుంచి తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధ పడుతున్న శరత్ బాబు బెంగళూరులోని ఓ ఆస్పత్రిలో చికిత్స చేయించుకున్నారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ తరలించారు. క్రమంలో అక్కడ చికిత్స పొందుతూ మరణించారు. ఆయన మరణ వార్త తెలిసి చిత్ర పరిశ్రమ ఎంతో దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది.
ఇక ఇంటి యజమానులు మరణిస్తే.. ఆ తరువాత ఆస్తుల కోసం వారసుల మధ్య గొడవలు జరగడం సర్వసాధారణం. అలానే ఎందరో సినీ ప్రముఖల కుటుంబాల్లోనూ ఆస్తి విషయంలో వివాదాలు జరిగిన ఘటనలు ఎన్నో జరిగాయి. అలానే శరత్ బాబుకి వారసులు లేకపోయినా ఆస్తులు మాత్రం కొందరికి చెందనున్నాయి. శరత్ బాబు మూడు పెళ్లిళ్లు చేసుకున్న ఈయనకు సంతానం లేరు. ఈ నేపథ్యంలో తన సోదరి సోదరుల పిల్లలకు దాదాపు 13 వాటాల ఆస్తులను పంచనున్నట్లు తెలుస్తోంది. ఇలా వారి వాట వారికి పంచిన కూడా శరత్ బాబు కంటూ కొన్ని ఆస్తులు ఉన్నట్లు సమాచారం.
ఇక వాటి గురించి కూడా ప్రస్తుతం తగాదాలు మొదలయ్యాయని సమాచారం. ఒకవైపు శరత్ బాబు మరణంతో అందరు బాధపడుతుంటే మరోకవైపు ఆస్తి గొడవలు ఆయన అభిమానులను కలచి వేస్తున్నాయి. ఇప్పటి వరకు శరత్ బాబు అనారోగ్యంతో బాధ పడుతుంటే.. ఆయన మరణం తరువాత ఈ ఆస్తి గొడవలు మరింత ఎక్కువయ్యాయి. ఇక్కడ మరో వార్త కూడా చక్కర్లు కొడుతుంది. శరత్ బాబు చనిపోక ముందు నుంచి కూడా ఆస్తి విషయంలో చర్చలు జరుగుతూ ఉన్నాయని గతంలో పెద్ద టాక్ వినిపించింది.
ఇక శరత్ బాబుకి చెన్నై, బెంగళూరు, హైదరాబాద్లో కూడా ఖరీదైన భవనాలతో పాటు ఎంతో విలువ చేసే ఆస్తులు కూడా ఉన్నాయని తెలుస్తోంది. అలానే మాల్స్, విల్లాలు వంటి ఖరీదైన ఆస్తులు కూడా శరత్ బాబు పేరున ఉన్నట్లు సమాచారం. ఆయన ఆస్తుల 13 కుటుంబాలకు చెందనున్నట్లు సమాచారం. ఏదిఏమైనా శరత్ బాబు నటుడిగా ఇండస్ట్రీలో ఓ వెలుగు వెలిగి చివరికి ఇలా అనారోగ్య సమస్యలతో బాధపడుతూ మరణించడం పట్ల చిత్ర పరిశ్రమ ఎంతో దిగ్బ్రాంతి వ్యక్తం చేస్తుంది. మరి.. శరత్ బాబు ఆస్తుల విషయంలో వస్తున్న వార్తలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.