మెగా హీరోల్లో.. మొత్తం టాలీవుడ్‌లోనే పవన్ కళ్యాణ్‌కు ఉన్న క్రేజ్ వేరే లెవల్. పవర్ స్టార్ కోసం ప్రాణాలిచ్చే అభిమానులున్నారు. సినిమాల పరంగా కాకుండా.. వ్యక్తిగతంగా ఆయన చేసే సమాజ సేవ చూసి చాలామంది పవన్‌కు అభిమానులుగా మారతారు. ఇక పవన్ కళ్యాణ్ గుప్తదానాలు, సేవా కార్యక్రమాల గురించి అందరికీ తెలిసిందే. సమస్యల్లో ఉండి.. ఆయన దృష్టికి వస్తే.. తప్పుకుండా ఆదుకుంటాడు. ఇక సెట్‌లో ఎవరికైనా ఏ కష్టమొచ్చినా సాయం చేస్తాడు. తన దృష్టికి వచ్చే సమస్యలను పవన్ కళ్యాణ్ తీర్చుతుంటాడు. కొంత కాలం క్రితం త్రివిక్రమ్ కూడా పవన్ కళ్యాణ్ సేవాగుణం గురించి చెప్పుకొచ్చాడు. ఓ మహిళ వచ్చి తన కష్టం చెప్పుకుంటే.. వెంటనే ఆర్థిక సాయమందించాడని పవన్ కళ్యాణ్ గురించి త్రివిక్రమ్ ఎంతో గొప్పగా చెప్పాడు.
ఇక ఇప్పుడు మరో సీనియర్ ఆర్టిస్ట్ సమ్మెట గాంధీ కూడా పవన్ కళ్యాణ్ గొప్పదనం గురించి చెప్పుకొచ్చాడు. అత్తారింటికి దారేది అనే సినిమా షూటింగ్ సమయంలో ఓ జూనియర్ ఆర్టిస్ట్ వచ్చాడట. తన కూతురి పెళ్లి అని కార్డ్ ఇచ్చాడట. సాయంత్రం కలువు అని పవన్ కళ్యాణ్ చెప్పాడట. మళ్లీ సాయంత్రం వెళ్లే సమయంలో ఆ జూనియర్ ఆర్టిస్ట్.. పవన్ కళ్యాణ్ ముందుకు వచ్చాడట. ఆ సమయంలో తన పీఏను పిలిచి లక్ష రూపాయాలు పెళ్లి కానుకగా ఇచ్చాడట.అలా పవన్ కళ్యాణ్ ఎంతో మందికి ఎన్నో రకాలుగా సాయం చేశారంటూ.. సమ్మెట గాంధీ చెప్పుకొచ్చాడు.
ఇది కూడా చదవండి: Pawan Kalyan: ‘అంటే సుందరానికి’ ప్రీరిలీజ్ ఈవెంట్ గెస్ట్ గా పవన్ కళ్యాణ్..!
ఇక రైటర్ సత్యానంద్ కూడా పవన్ కళ్యాణ్ చేసిన సాయాల గురించి చెబుతుంటాడు. పవన్ కళ్యాణ్ సినిమాల్లోకి రాకముందే తనకు సాయం చేశాడంటూ ఓ ఇన్సిడెంట్ గురించి ఆ మధ్య ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చిన సంగతి తెలిసిందే.. తన చెల్లి పెళ్లి అని చెప్పగానే.. పవన్ కళ్యాణ్ వచ్చి డబ్బుల కట్ట చేతుల పెట్టాడని సత్యానంద్ నాటి సంగతులను గుర్తు చేసుకున్నాడు. మరి పవన్ కళ్యాణ్ చేసిన సాయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
ఇది కూడా చదవండి: పవన్ కల్యాణ్ కు రూ.1,000 కోట్ల ఆఫర్ ప్రకటించిన KA పాల్!