ఐకాన్ స్టార్ అల్లు అర్జున్- సుకుమార్ కాంబో హ్యాట్రిక్ హిట్ ‘పుష్ప- ది రైజ్’. పుష్ప సినిమా ఎంత పెద్ద హిట్ కొట్టిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వెండితెర మీదే కాదు.. జనవరి 7 నుంచి ప్రైమ్ లోనూ రికార్డులు సృష్టిస్తోంది. బాలీవుడ్ నుంచి సైతం బన్నీ- సుకుమార్ పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఇప్పుడు అందరి ఆలోచన పుష్ప-2 ఏ రేంజ్ లో ఉండబోతోంది అనే. అదే విషయంపై అనసూయ తమ్ముడిగా మొగిలేష్ క్యారెక్టర్ చేసిన యాక్టర్ రాజు చిన్న హింట్ ఇచ్చాడు.
నోట్లో బ్లేడు పెట్టుకుని బావ మంగళం శ్రీను చెప్పిన పనల్లా ముందు వెనక ఆలోచించకుండా చేసే క్యారెక్టర్ లో రాజు ఒదిగిపోయాడు. మొదటి భాగంలోనే మొగిలేష్ పాత్ర మరణిస్తుంది. ఆ విషయంపై అతని అక్క దాక్షాయణి.. మంగళం శ్రీనుపై దాడి చేస్తుంది. అయితే అతను మరణించాడా? లేదా? అన్న దానిపై క్లారిటీ ఇవ్వలేదు. ఆ విషయాన్ని రాజు బయటపెట్టేశాడు. అనసూయ బ్లేడ్ తో సునీల్ పై దాడి చేశాక అతను ఆస్పత్రి పాలవుతాడు. కానీ, చనిపోడని మొగిలేష్ లీక్ చేసేశాడు. అయితే సెకెండ్ పార్ట్ లో సునీల్ కి బన్నీకి మధ్య భారీ యాక్షన్ సీన్లు చూసే అవకాశం లేకపోలేదు. పుష్ప-2 ఎలా ఉండబోతోంది? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.