మెగాస్టార్ చిరంజీవిలా ఉండటం నా కెరీర్ కు పెద్ద మైనస్ అయ్యిందని చెప్పుకొచ్చాడు సీరియల్ నటుడు రాజ్ కుమార్. ఇండస్ట్రీలో జూ. చిరంజీవిగా ముద్ర వేయించుకున్నారు. అదే తన కెరీర్ కు ఇబ్బందిగా మారింది అంటున్నాడు.
సాధారణంగా మనుషులను పోలిన మనుషులు 7 ఉంటారు అని పెద్దలు చెబుతుంటారు. అయితే అలా ఉండటం వల్ల నాకు మైనస్ అయ్యింది అంటున్నారు సీరియల్ నటుడు రాజ్ కుమార్ అలియాస్ జూ. చిరంజీవి. రాజ్ కుమార్ 30 ఏళ్ల సినీ ప్రయాణంలో సినిమాలతో పాటుగా పలు సీయల్స్ లో నటించారు. అయితే రాజ్ కుమార్ జూనియర్ చిరంజీవిగానే పాపులర్ అయ్యాడు. కానీ సినిమాల్లో పై స్థాయికి మాత్రం వెళ్లలేకపోయాడు. దానికి ప్రధాన కారణం నేను చిరంజీవి లా ఉండటమే అంటున్నాడు రాజ్ కుమార్. మెగాస్టార్ లా ఉండటం నా కెరీర్ కు మైనస్ అయ్యిందని చెప్పుకొచ్చాడు. తన ఫస్ట్ ఇంటర్వ్యూను ప్రముఖ ఛానల్ అయిన సుమన్ టీవీకి ఇచ్చాడు. ఈ ఇంటర్వ్యూలో తన జీవితానికి సంబంధించిన విషయాలను వివరించాడు.
ఈ సందర్భంగా రాజ్ కుమార్ మాట్లాడుతూ..”చిరంజీవిలా ఉండటం నా అదృష్టం, అయితే.. ఆయనలా ఉండటం నాకు మైనస్ గా మారింది. హీరోకి బ్రేకింగ్ పాయింట్ అనేది ఉండాలి. అయితే నాకు బ్రేకింగ్ పాయింట్ వచ్చే నాటికి నేను చిరంజీవిలా ఉంటానని ఫీల్డ్ లో తెలిసిపోయింది. అయితే బయట అది బాగుంటుంది, కానీ ఇండస్ట్రీలో మాత్రం మైనస్ గా మారింది. చిరంజీవితో పోలిక అనగానే మర్రిచెట్టు కింద కలుపు మెుక్కలా నా పరిస్థితి మారింది. దాంతో నేను కర్ణాటకు వెళ్లిపోయాను” అంటూ చెప్పుకొచ్చారు రాజ్ కుమార్. ఇక తొక్కేశారు అన్న ప్రశ్నకు సమాధానం ఇస్తూ..” తొక్కేస్తే.. అసలు నేను టీవీలో కనిపించే వాడినే కాదు. నన్ను ఆయన తొక్కేయడం ఏంటి?” అంటూ చెప్పుకొచ్చాడు. మరి మెగాస్టార్ లా ఉండటం మైనస్ అయ్యింది అన్న రాజ్ కుమార్ వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.