సినిమా అంటే వేల మంది కష్టం. వందల రోజుల పాటు.. కోట్ల రూపాయలు ఖర్చు పెడితే గాని ఒక మంచి సినిమా ప్రేక్షకుల ముందుకి రాదు. అయితే.. ఇంత కష్టపడి తెరకెక్కించిన సినిమాని ఒకే ఒక్క రివ్యూతో బాగుంది, బాగాలేదని తేల్చేస్తుంటారు రివ్యూవర్స్. ఇక సోషల్ మీడియా వేగం అందుకున్న తరువాత సగటు అభిమాని కూడా రివ్యూవర్ అయిపోయాడు. తనకి సినిమా నచ్చితే బాగుందని, నచ్చకపోతే బాగాలేదని మొహమాటం లేకుండా రివ్యూ ఇచ్చేస్తున్నారు నెటిజన్స్.
సినిమా జనం మాత్రం ఈ రివ్యూ సిస్టమ్ పై మొదటి నుండి గుర్రుగానే ఉంటూ వస్తున్నారు. గతంలో కృష్ణవంశీ, రామ్ గోపాల్ వర్మ, జూనియర్ యన్టీఆర్ వంటి ప్రముఖులు అంతా ఈ రివ్యూ సిస్టమ్ పై బాహాటంగా తమ వ్యతిరేకతని వెళ్లగక్కిన సందర్భాలు ఉన్నాయి. అయితే.. తాజాగా ఈ లిస్ట్ లోకి ప్రముఖ కమెడియన్ రాహుల్ రామకృష్ణ వచ్చి చేరాడు. ఈయన మిగతా అందరిలా కాకుండా.. ఈ విషయంలో కాస్త ఘాటుగా రెస్పాండ్ అయ్యాడు.
ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉన్న రాహుల్ రామకృష్ణ తాజాగా ట్విట్టర్ లో.. “గు*లో దమ్ముంటే సినిమా తీయండిరా ఇడియట్స్” అంటూ పోస్ట్ చేశాడు. రాహుల్ నుండి ఇంత అసభ్యకరమైన ట్వీట్ రావడంతో నెటిజన్స్ అంతా ఈ కమెడియన్ ని ట్రోల్ చేస్తున్నారా? సినిమాపై అభిప్రాయం చెప్పడానికి సినిమా తీయడం రావాల్సిన అవసరం లేదు. రివ్యూ సిస్టమ్ అనేది ఒక్క సినీ పరిశ్రమలోనే లేదు. అన్నీ బ్రాండ్స్ ఉత్పత్తులపై రివ్యూస్ అనేవి సాధారణంగా ఇస్తూనే ఉంటారు. ఆ మాత్రం కూడా తెలియకుండా.. ఇంత బూతు ట్వీట్ పెట్టావ్ ఏంటి బ్రో.. అంటూ రాహుల్ రామకృష్ణపై నెటిజన్స్ ఫైర్ అవుతున్నారు. మరి.. రాహుల్ రామకృష్ణ ట్వీట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
Guddhalo dhum unte…..
cinema theeyyandra idiots.— Rahul Ramakrishna (@eyrahul) July 1, 2022