దేశ వ్యాప్తంగా ఇప్పుడు ఎక్కడ చూసినా ‘ఆర్ఆర్ఆర్’మూవీ గురించిన చర్చలే నడుస్తున్నాయి. ఆర్ఆర్ఆర్ చిత్రంతో రాజమౌళి క్రేజ్ జాతీయ మీడియాలో స్పష్టంగా కనిపించింది. సాధారనంగా పాన్ ఇండియా లెవెల్ లో హీరో, హీరోయిన్లకు మంచి క్రేజ్ ఉంటుంది..కానీ డైరెక్టర్ రాజమౌళికి పెద్ద కటౌట్స్ ఏర్పాటు చేసి హంగామా చేస్తున్నారు అభిమానులు. ఆ రేంజ్ లో ఓటమి ఎరుగని దర్శకధీరుడిగా రాజమౌళి పేరు తెచ్చుకున్నారు.
తెలుగు ఇండస్ట్రీలో పలు చిత్రాల్లో విలన్ గా నటించిన రాహూల్ దేవ్ దర్శకుడు రాజమౌళి గురించి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తెలుగు ఇండస్ట్రీలో మంచి క్రేజ్ రావడానికి కారణం రాజమౌళి తెరకెక్కించిన సింహాద్రి చిత్రం అని అన్నారు. అప్పట్లోనే ఆయన టాలెంట్ ఏంటో తెలిసిందని అన్నారు. అప్పట్లో ఆయన గురించి చెబితే రాజమౌళా ఆయన ఎవరు అని ప్రశ్నించేవారు.. కానీ బాహుబలి చిత్రం తర్వాత రాజమౌళి పేరు జాతీయ స్థాయిలో మారు మోగిందని, ఆయన ఏ రేంజ్ కి ఎదిగాడో అందరికీ తెలిసేందనని అన్నారు.
సినీ ఇండస్ట్రీలో ఆయనతో నటించాలని ప్రతి హీరో కోరుకుంటున్నాడు. ఆయన తీసే చిత్రంలో ఏ చిన్న పాత్ర అయినా ఓకే అంటున్నారు ఇతర నటులు. అప్పట్లో దక్షిణాది చిత్రాల్లో నటిస్తుంటే ఎందుకు నటిస్తున్నావ్ అని కొందరు హేళనగా మాట్లాడేవారు.. కానీ ఇప్పుడు స్టార్ హీరోలు సైతం దక్షిణాదికి వెళ్లారని తెలిపారు. తాను 32 దక్షిణాది సినిమాల్లో నటించానని. స్టార్ దర్శకులతో నటించడం తనకు ఎంతో సంతోషాన్ని ఇస్తుందని అన్నారు.