Pratap Pothen: ఇండస్ట్రీలో వరుస విషాదాలు సినీ ప్రేక్షకులను కలచివేస్తున్నాయి. ఇటీవల నటి రాధికా మాజీ భర్త, సీనియర్ నటుడు, దర్శకుడు ప్రతాప్ పోతెన్ చెన్నైలోని స్వగృహంలో కన్నుమూసిన విషయం తెలిసిందే. లైఫ్ లో రెండు పెళ్లిళ్లు చేసుకున్న ప్రతాప్.. చివరికి ఒంటరిగానే కన్నుమూయడం అనేది విషాదంగా మారింది.
ప్రస్తుతం ప్రతాప్ వయస్సు 70 సంవత్సరాలు. కాగా చెన్నైలోని తన నివాసంలో శుక్రవారం ఉదయం విగత జీవిగా కనిపించారు. ఆయన మరణవార్త తెలిసి దక్షిణ చిత్రపరిశ్రమ ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురైంది. ప్రతాప్ మలయాళీ నటుడే అయినప్పటికీ, దక్షిణాది అన్ని భాషల్లో సినిమాలు చేసి మంచి గుర్తింపు దక్కించుకున్నారు. మలయాళం, తమిళంలో ఎక్కువ సినిమాలు చేసిన ప్రతాప్.. తెలుగులో తక్కువ సినిమాలు చేశారు.
ప్రతాప్ తెలుగులో ఆకలి రాజ్యం, కాంచనగంగ, మరోచరిత్ర, వీడెవడు లాంటి చిత్రాల్లో కనిపించారు. ఇక మల్టీటాలెంటెడ్ అయిన ప్రతాప్.. నటుడిగా మాత్రమే కాకుండా నిర్మాతగా, దర్శకుడిగా, రచయితగా పలు సినిమాలకు పలు హిట్ చిత్రాలను రూపొందించారు. అయితే.. ప్రతాప్ పర్సనల్ లైఫ్ విషయానికి వస్తే.. 1985లో హీరోయిన్ రాధికను పెళ్లి చేసుకున్నారు. కానీ.. ఏడాది తిరగకుండానే 1986లో ఇద్దరూ పరస్పర అంగీకారంతో విడిపోయినట్లు తెలుస్తుంది.
ఈ క్రమంలో రాధికతో విడాకులు అయ్యాక ప్రతాప్ నాలుగేళ్ళు ఒంటరిగానే ఉన్నారు. ఆ తర్వాత 1990లో అమల సత్యనాథన్ ను పెళ్లి చేసుకున్నారు ప్రతాప్. వీరికి ఒక కూమార్తె ఉంది. ఇక అమల సత్యనాథన్ కు కూడా 2012లో విడాకులు ఇచ్చారు ప్రతాప్. అప్పటినుండి చెన్నైలో ఒంటరిగా ఉంటూ సినిమాలు చేస్తున్నారు. ఇదిలా ఉండగా.. గతంలో ప్రతాప్ తన ఫ్యామిలీ, మ్యారేజ్ లైఫ్ గురించి మాట్లాడిన మాటలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
ఈ నేపథ్యంలో.. రాధికతో విడాకులు తీసుకోవడానికి ప్రత్యేక కారణాలు లేవని చెప్పిన ప్రతాప్.. ఆమె మంచి వ్యక్తి అని కితాబివ్వడం విశేషం. ఇద్దరం పరస్పర అండస్ట్రాండింగ్, అంగీకారంతోనే విడాకులు తీసుకున్నామని తెలిపినట్లు సినీవర్గాలు చెబుతున్నాయి. పెళ్లి అనేది అందరి జీవితానికి సరైనది కాదని, అది ఇరువురి ఆలోచనలు బట్టి ఉంటుందని చెప్పినట్లు సమాచారం. మరి ప్రతాప్ పోతెన్ మృతిపట్ల మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.
Rest in peace uncle! I will miss you. 💔#PrathapPothen pic.twitter.com/bJcKNWpWgP
— Prithviraj Sukumaran (@PrithviOfficial) July 15, 2022