ఎట్టకేలకు బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్.. తాజాగా ‘పఠాన్’ మూవీతో సూపర్ హిట్ అందుకున్నాడు. షారుఖ్ ఫ్యాన్స్ అంతా ఎంతోకాలంగా ఇలాంటి మాసివ్ హిట్ కోసం ఎదురుచూశారు. ఎన్నో వివాదాలను ఫేస్ చేసి.. రిపబ్లిక్ డే సందర్భంగా విడుదలైన పఠాన్ సినిమా.. ఫస్ట్ షో నుండే పాజిటివ్ టాక్ సొంతం చేసుకొని ఫ్యాన్స్ లో, బాలీవుడ్ సినీ వర్గాలలో ఉత్సాహాన్ని నింపింది. పదేళ్ల క్రితం వచ్చిన చెన్నై ఎక్స్ ప్రెస్ తర్వాత షారుఖ్ ఖాతాలో ఆ స్థాయి హిట్ పడలేదు. దీంతో పఠాన్ హిట్ తో ఒక్కసారిగా షారుఖ్ పై పాజిటివ్ వైబ్ ఏర్పడింది. ఈ క్రమంలో షారుఖ్ హిట్ ని తమ హిట్ గా భావిస్తున్న ఎంతోమంది ఫ్యాన్స్, సినీ సెలబ్రిటీలు సోషల్ మీడియాలో ట్వీట్స్ చేస్తూ రియాక్ట్ అవుతున్నారు.
తాజాగా పఠాన్ బ్లాక్ బస్టర్ పై స్పందిస్తూ ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్.. సినిమాలను ‘బాయ్ కాట్’ అంటూ ట్రోల్ చేసే బ్యాచ్ పై కౌంటర్ వేశారు. పఠాన్ సాంగ్స్ రిలీజ్ అయినప్పుడు దేశవ్యాప్తంగా బాయ్ కాట్ నినాదాలు, నిరసనలతో దుమారం రేగిన సంగతి తెలిసిందే. అటు సాంగ్స్ లో దీపికా పదుకొనే బికినీ పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. తమ మనోభావాలు దెబ్బ తిన్నాయంటూ చాలామంది సోషల్ మీడియాలో ‘బాయ్ కాట్ పఠాన్’ అని విపరీతంగా ట్రోల్ చేశారు. ఏకంగా మధ్యప్రదేశ్ మంత్రి కూడా సినిమాను బ్యాన్ చేయాలని, రిలీజ్ ఆపాలని డిమాండ్ చేశారు. మొత్తానికి రిలీజ్ కి ముందు పఠాన్ పై ఒక రకమైన నెగిటివ్ వాతావరణాన్ని సెట్ చేశారు ట్రోలర్స్. పలు సంఘాల నాయకులు.
ఈ నేపథ్యంలో పీఎం నరేంద్రమోడీ స్పందించి.. సినిమాలను ట్రోల్ చేయొద్దని పిలుపునిచ్చారు. మోడీ పిలుపుతో పఠాన్ పై కాస్త బాయ్ కాట్ ట్రోలింగ్స్ తగ్గాయి. అయినా ఎక్కడో చోట కొన్ని బ్యాచులు నినాదాలు చేస్తూనే ఉన్నాయి. ఆ తర్వాత ట్రైలర్ వచ్చేసరికి సినిమాపై పూర్తిగా ఆడియెన్స్ అభిప్రాయాలు మారిపోవడమే కాకుండా.. దేశభక్తి పాయింట్ ఉండటంతో పాజిటివ్ వాతావరణం క్రియేట్ అయ్యింది. వెరసి.. పఠాన్ సినిమా రిలీజై బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకొని, ఫస్ట్ డే రూ. 100 కోట్లకు పైగా వసూళ్లతో బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ సెట్ చేసింది. ఈ మధ్యకాలంలో పఠాన్ పై వచ్చిన ట్రోల్స్, నెగిటివ్ కామెంట్స్ ఏ సినిమాపై రాలేదు.
అలాంటిది ఇప్పుడు సినిమా బ్లాక్ బస్టర్ అయ్యేసరికి ట్రోలర్స్ అంతా సైలెంట్ అయిపోయారు. ఈ క్రమంలో సినిమాలను బాయ్ కాట్ అంటూ ట్రోల్ చేసే బ్యాచ్ ని టార్గెట్ చేస్తూ.. నటుడు ప్రకాష్ రాజ్ చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. సినిమా రిలీజైన రోజే ప్రకాష్ రాజ్ ట్వీట్ లో “హే బాయ్ కాట్ బిగోట్స్.. ష్. సైలెంట్ అయ్యారేంటి? ఇప్పుడు మాట్లాడండి.. కింగ్ షారుఖ్ ఈజ్ బ్యాక్..” అని పఠాన్ టీమ్ ని విష్ చేశారు. ప్రస్తుతం ప్రకాష్ రాజ్ చేసిన ట్వీట్ దుమారాన్ని రేపుతుండగా.. ట్రోలర్స్ అంతా నిజంగానే సైలెంట్ అవ్వడం గమనార్హం. కొన్నాళ్లుగా ఏ సినిమా వచ్చినా.. రిలీజ్ కి ముందు బాయ్ కాట్, బ్యాన్ అంటూ ట్రోల్ చేయడం మామూలే అయిపోయింది. దీంతో మోడీ స్పందించి ట్రోల్ చేయొద్దని చెప్పడంతో కాస్త తగ్గారు ట్రోలర్స్. ఇప్పుడు సినిమా హిట్ టాక్ రాగానే పూర్తిగా ట్రోలర్స్ కి మాట్లాడే ఛాన్స్ లేకుండా పోయింది. సో.. బాయ్ కాట్ బ్యాచ్ ని ఉద్దేశిస్తూ ప్రకాష్ రాజ్ చేసిన ట్వీట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.
Hey #BoycotBigots Shhhhhhhhh … #HallaBol King Khan @iamsrk is back.. keep rocking @deepikapadukone #JohnAbraham and team #Pathan ..#BesharamRang 👍👍👍👍👍
— Prakash Raj (@prakashraaj) January 25, 2023