తెలుగు బుల్లితెర ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేస్తోన్న టాప్ షోల్లో ‘ఢీ’ ఒకటి. దక్షిణ భారత దేశంలోనే అతి పెద్ద డ్యాన్స్ రియాలిటీ షోగా ఢీ షో కి గుర్తింపు ఉంది. ఈ షో ద్వారా పరిచయం అయిన వారు నేడు టాప్ కోరియోగ్రాఫర్స్‌గా ఇండస్ట్రీలో గుర్తింపు తెచ్చుకున్నారు. ఇక ఈ షోలో డ్యాన్స్‌తో పాటు టీమ్ లీడర్స్, యాకంర్, జడ్జెస్‌తో కలిసి చేసే కామెడీ స్కిట్లు కూడా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటాయి. టాప్ రేటింగ్‌తో దూసుకుపోతున్న ఈ షో జూలై 27న ప్రసారం కాబోయే ఎసిసోడ్‌కు సంబంధించిన ప్రోమోని విడుదల చేశారు. ఇందులో జడ్జీగా వ్యవహరిస్తున్న నటి పూర్ణ స్టేజిపైనే వెక్కి వెక్కి ఏడ్చింది. ప్రస్తుతం ఈ తాజా ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఈ ప్రోమోలో భాగంగా ఎప్పటిలాగే కంటెస్టెంట్లు తమ అద్భుతమైన ప్రదర్శనతో దుమ్ముదులిపారు. ఇది ఇలా ఉండగా ఈ కార్యక్రమంలో భాగంగా ఓ కంటెస్టెంట్ అమ్మ సెంటిమెంట్ తో కూడిన పాటకు చేసిన డ్యాన్స్.. అందరిని పెద్ద ఎత్తున ఏడిపించింది. రఘువరన్ బీటెక్ సినిమాలోని ‘అమ్మ.. అమ్మా..’ అనే సాంగ్ కి ఆ షోలోని అందరి కళ్లలో నీళ్లు తిరిగాయి. ఈ క్రమంలో నటి పూర్ణ ఎంతో ఎమోషనల్ అయ్యారు. ఏకంగా వేదికపైకి వచ్చి.. కంటెస్టెంట్ ను గట్టిగా పట్టుకుని వెక్కి వెక్కి ఏడ్చింది.
మరొక జడ్జీ శ్రద్దాదాస్ కళ్ల నుంచి కూడా కన్నీటి ధారా పొంగింది. ఆ పెర్ఫామెన్స్ చూసిన ప్రతి ఒకరు ఎంతో ఎమోషనల్ అవుతూ కంటతడి పెట్టుకున్నారు. ప్రస్తుతం ఈ ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అయితే ఈ సాంగ్ పూర్తి పెర్ఫార్మెన్స్ చూడాలంటే ఈ ఎంపిసోడ్ ప్రసారమయ్యే వరకు వేచి చూడాలి. ఈ ఎపిసోడ్ ఆగస్టు 31న ఓ ప్రసారం కానుంది. మరి.. ఈ ప్రోమోపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.