కుడిచేతితో చేసిన దానం.. ఎడమచేతికి తెలియకూడదు అన్న సామెతను మెగాస్టార్ చిరంజీవి అక్షరాల పాటిస్తున్నారు. అందుకే ప్రముఖ నటుడు వైద్యానికి రూ. 40 సాయం చేసి ఎక్కడా తెలీకుండా జాగ్రత్తపడ్డారు. ఈ విషయాన్ని తాజాగా సాయం పొందిన నటుడు పొన్నంబలం చెప్పుకొచ్చాడు.
కుడిచేతితో చేసిన దానం.. ఎడమచేతికి తెలియకూడదు అన్న సామెతను మనం చిన్నతనం నుంచి వింటూనే ఉన్నాం. అయితే సాయం చేసిన మనిషి దాని గురించి చెప్పుకోకపోవచ్చు అది వారి సంస్కారం, మంచితనం. అయితే సాయం పొందిన వ్యక్తి మాత్రం ఆ విషయాన్ని ప్రాణం పోయేదాక మర్చిపోడు. ఇప్పుడు ఈ మాటలు గుర్తు చేయాడానికి ప్రధాన కారణం.. మెగాస్టార్ చిరంజీవి. గతంలో ఓ ప్రముఖ నటుడు అనారోగ్యానికి గురికాగా.. అతడి వైద్యానికి అయిన రూ. 40 లక్షలు సాయం చేసి నటుడు పొన్నంబలం పాలిట దేవుడు అయ్యాడు మెగాస్టార్ చిరంజీవి. ఈ విషయాన్ని తాజాగా ఓ యూట్యూబ్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు పొన్నంబలం. ఈ సందర్బంగా మరిన్ని వివరాలను చెప్పుకొచ్చాడు ఈ స్టార్ విలన్.
పొన్నంబలం.. తమిళ, తెలుగు ఇండస్ట్రీలో 90వ దశకంలో ఈ పేరు తెలియని ప్రేక్షకులు లేరంటే అతిశయోక్తికాదు. తనదైన విలనిజంతో.. చిత్ర పరిశ్రమలో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. తెలుగులో టాప్ హీరోలందరి సినిమాల్లో విలన్ గా నటించి మెప్పించాడు పొన్నంబలం. అయితే కోలీవుడ్ లో కెరీర్ పీక్స్ లో ఉన్నప్పుడే.. సినిమాల్లో నుంచి మాయం అయ్యాడు. దాంతో అందరు అతడిని మర్చిపోయారు. ఇక అనుకోకుండా 2018 తమిళ బిగ్ బాస్ హౌస్ లో కంటెస్టెంట్ గా అడుగుపెట్టి అందరిని ఆశ్చర్యపరిచాడు. ఈ క్రమంలోనే తాజాగా ఓ యూట్యూబ్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన ఆరోగ్యం గురించి, అప్పుడు తనకు సాయం చేసిన వ్యక్తుల గురించి చెప్పుకొచ్చాడు. “రెండు సంవత్సరాల క్రితం నాకు కిడ్నీ ప్రాబ్లం వచ్చింది. దాంతో ఎవరైనా సాయం చేస్తారాని అని వేచి చూస్తున్నాను. అప్పుడే నాకు చిరంజీవి గుర్తుకు రావడంతో.. నా ఫ్రెండ్ ద్వారా నెంబర్ తీసుకుని మెగాస్టార్ కు అన్నయ్య నాకు ఆరోగ్యం బాలేదు. ఏమైనా సాయం చేయండి అని మెసేజ్ పెట్టాను.
అయితే మెసేజ్ చేసిన 10 నిమిషాల తర్వాత నాకు అన్నయ్య నుంచి కాల్ వచ్చింది. హాయ్ పొన్నంబలం.. నేనున్నాను భయపడకు. హైద్రాబాద్ కు వచ్చెయ్ అన్నారు. రాలేను అన్న అంటే.. సరే అని చెన్నైలోని అపోలో ఆస్పత్రి నుంచి నీకు ఫోన్ వస్తుంది. అక్కడికి వెళ్లి అడ్మిట్ అవ్వు అని చెప్పారు” అని పొన్నంబలం ఈ సందర్బంగా గుర్తు చేసుకున్నారు. మెగాస్టార్ చెప్పినట్లుగానే అక్కడి వెళ్లానని, ఒక్క రూపాయి తీసుకోకుండా నాకు వైద్యం చేశారని అతడు చెప్పాడు. నా వైద్యానికి రూ. 40 లక్షలు ఖర్చు అయ్యిందని, ఆ మెుత్తం డబ్బును చిరంజీవి ఇచ్చారని చెప్పుకొచ్చాడు పొన్నంబలం. అడగానే లక్ష రూపాయలో లేదా 2 లక్షలో చిరంజీవి సాయం చేస్తారు అనుకున్నా, గానీ 40 లక్షలు ఇస్తారని అనుకోలేదు అంటూ భావోద్వేగానికి గురైయ్యాడు పొన్నంబలం. ఇప్పటికే ఛారిటీల ద్వారా ఎంతో మంది పేదలకు సాయం చేస్తున్న మెగాస్టార్ చిరంజీవి సేవా గుణం ఎలాంటిదో మరోసారి రుజువు అయ్యింది. మరి సాయం చేసి కూడా ఎక్కడా చెప్పుకోని చిరంజీవి సేవాగుణంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెయజేయండి.
నా ఆరోగ్యం క్షీణిస్తున్న టైంలో ఎవరినడగాలో తెలియక @KChiruTweets గారినడిగితే 1 లక్షో, 2లక్షలో సహాయం చేస్తారనుకుంటే – నేనున్నా అని చెప్పి 5ని||లో దగ్గరలో ఉన్న అపోలో కి వెళ్ళమని అడ్మిట్ అవ్వమన్నారు – అక్కడ నన్ను ఎంట్రీ ఫీస్ కూడా అడగలేదు
మొత్తం 40లక్షలయ్యంది ఆయనే చూస్కున్నారు🙏 pic.twitter.com/HHdBcSiwPm
— 𝙺𝙰𝙺𝙸𝙽𝙰𝙳𝙰 𝙼𝙴𝙶𝙰 𝙳𝙴𝚅𝙾𝚃𝙴𝙴 (@Gowtham__JSP) March 15, 2023