ప్రముఖ నటుడు పొన్నంబలం.. కిడ్నీ ఫెయిల్యూర్ కారణంగా ఆస్పత్రిలో చేరిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన కోలుకున్నాడు. అనంతరం ఆయన ఓ వెబ్‌సైట్‌కు ఇంటర్వ్యూ ఇచ్చాడు. దీనిలో సంచలన విషయాలు వెల్లడించాడు. ఆ వివరాలు..
పొన్నంబలం పేరుకు తమిళ నటుడు అయినా.. తెలుగు ప్రేక్షకులకు కూడా సూపరిచితుడే. భీకరమైన విలనిజంతో ఇండస్ట్రీలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. అయితే ఇటీవలే ఆయన అనారోగ్యం కారణంగా ఆస్పత్రిలో చేరిన సంగతి తెలిసిందే. కిడ్నీలు పాడవ్వడంతో పొన్నంబలం ఆస్పత్రిలో చేరాడు. ఇక ఆయన చికిత్స కోసం మెగాస్టార్ చిరంజీవి ఏకంగా 40 లక్షల రూపాయాల ఆర్థిక సాయం చేసిన సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని స్వయంగా ఆయనే వెల్లడించాడు. చిరంజీవికి ఒక్క మెసేజ్ చేసి.. తన అనారోగ్యం గురించి చెబితే.. వెంటనే స్పందించి.. 40 లక్షల భారీ ఆర్థిక సాయాన్ని అందించారు అని తెలిపాడు పొన్నంబలం.
ఈ క్రమంలో పొన్నంబలం ఆస్పత్రిలో చేరడానికి సంబంధించి రకరకాల వార్తలు మీడియాలో చక్కర్లుకొట్టాయి. అతిగా మద్యం సేవించడం, డ్రగ్స్ వాడకం వల్లే ఆయన కిడ్నీలు పాడైయ్యాయంటూ వార్తలు వచ్చాయి. అయితే ఇవన్ని అవాస్తవం అన్నాడు పొన్నంబలం. తాను అనారోగ్యం పాలవ్వడానికి కారణం చెడు అలవాట్లు కాదని.. దీని వెనక ఓ వ్యక్తి ఉన్నాడంటూ పొన్నంబలం వెల్లడించాడు. ఆయన చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.
కొన్ని వారాల క్రితం నటుడు పొన్నంబలం కిడ్నీ ఫెయిల్యూర్ కారణంగా ఆస్పత్రిలో చేరారు. ఈ క్రమంలో పొన్నంబలం బంధువు, దర్శకుడు జగన్నాథన్ తన కిడ్నీని పొన్నంబలంకు దానం చేశాడు. ఇక చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో పొన్నంబలకు ఫిబ్రవరి 10న కిడ్నీ మార్పిడి జరిగింది. ఆయన డిశ్చార్జ్ అయి ఇంటికి చేరుకున్నాడు. కోలుకున్న తర్వాత ఆయన ఓ వెబ్‌సైట్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో సంచలన విషయాలు వెల్లడించాడు పొన్నంబలం. తాను ఆస్పత్రిలో చేరడానికి మద్యం, మాదక ద్రవ్యాల వినియోగమే కారణమని.. దాని వల్లే తన కిడ్నీలు పాడయ్యాయని చాలా మంది భావించారన్నారు. కానీ అది వాస్తవం కాదని పొన్నంబలం తెలిపాడు. సొంతవాళ్లే తనపై విషప్రయోగం చేయడంతో.. తన ఆరోగ్యం పాడయ్యిందని వెల్లడించాడు.
ఈ సందర్భంగా పొన్నంబలం మాట్లాడుతూ.. ‘‘మా నాన్నకి నలుగురు భార్యలు. మూడో భార్య కుమారుడు.. కొంతకాలం నా దగ్గర మేనేజర్‌గా పని చేశాడు. సొంత తమ్ముడే కావడంతో నేను తనను పూర్తిగా నమ్మాను. కానీ తను మాత్రం నన్ను చంపాలని భావించాడు. నా దగ్గర పని చేస్తున్న సమయంలోనే ఒకసారి నా తమ్ముడు నాకు బీరులో స్లో పాయిజన్ ఇచ్చాడు. అయితే మొదట ఈ విషయం నాకు తెలియలేదు. అనారోగ్యానికి గురైన తర్వాత అర్థం అయ్యింది. కానీ దేవుడి దయ వల్ల ఇప్పుడు నా ఆరోగ్యం బాగుంది.. కోలుకుంటున్నాను’’ అని వెల్లడించారు.
‘‘ఇక నేను ఆస్పత్రిలో చేరిన విషయం తెలిసి.. చాలా మంది నాకు సాయం చేశారు. వారందరికి నేను జీవితాంతం రుణపడి ఉంటాను’’ అని తెలిపాడు. ఇక నటుడు పొన్నంబలం విషయానికి వస్తే.. ఆయన 90వ దశకంలో తమిళ చిత్రసీమలో ప్రధాన విలన్‌గా వెలుగొందాడు. రజనీ, కమల్, అజిత్, విజయ్ వంటి ప్రముఖ హీరోలకు విలన్‌గా నటించాడు. అంతేకాక ఆయన తెలుగు కూడా పలు సినిమాల్లో కూడా నటించాడు. ప్రస్తుతం పొన్నంబలం చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. మరి దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.