నిరుపమ్ పరిటాల అంటే తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు పెద్ద తెలియక పోవచ్చు. కానీ డాక్టర్ బాబు అంటే మాత్రం ప్రతి ఒక్కరు గుర్తుపడతారు. అంతలా బుల్లితెరపై క్రేజ్ సంపాదించాడు కార్తీక్ దీపం సీరియల్ హీరో నిరుపమ్. ఆ సీరియల్ లో డాక్టర్ బాబు పాత్రలో నిరుపమ్ నటన అందరిని ఆకట్టుకుంది. నిరుపమ్, ప్రేమ విశ్వనాథ్ పాత్రలే ఆ సీరియల్ కు ప్రధాన ఆకర్షణలా మారాయి. వారిద్దరు లేకపోతే ఆ సీరియల్ చూసే వారే కరువయ్యారు. చాలా మంది నిరుపమ్ నటనకు ప్రశంల వర్షం కురించారు. ఇలాంటి ప్రశంసలు అందుకున్న నిరుపమ్.. ఓ యంగ్ పొలిటీషియన్ పై పొగడ్తల వర్షం కురించాడు. రియల్ హీరో అంటూ టీడీపీ నేత పరిటాల శ్రీరామ్ పై నిరుపమ్ కామెంట్స్ చేశారు. ప్రస్తుతం వారిద్దరు కలిసి దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
తెలుగు ప్రేక్షకులకు నిరుపమ్ పరిటాల బాగానే పరిచయం ఉంది. కార్తీక దీపం సీరియల్ కంటే ముందు పలు సినిమాలు, సీరియల్స్ లో కూడా నటించాడు. అయితే కార్తీక దీపం సీరియల్ తో ఓ రేంజ్ లో క్రేజ్ సంపాందించాడు. హీరోల స్థాయిలో నిరుపమ్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. చాలా మంది ఆయనను బుల్లితెర శోభన్ బాబు అని పిలుచుకుంటున్నారు. దీని బట్టి అర్ధం చేసుకోవచ్చు ఆయన ఫ్యాన్ ఫాలోయింగ్ ఏ రేంజ్ లో ఉందనేది. అయితే ఆ ఫాలోయింగ్ ను నిరుపమ్ సోషల్ మీడియా ద్వారా ఇంకా పెంచేసుకున్నాడు. తనకు, తన కుటుంబానికి సంబంధించిన ఫోటోలను, వీడియోలనుూ సోషల్ మీడియా ద్వారా అభిమానులకు షేర్ చేస్తుంటారు.
అంతేకాక సోషల్ మీడియాలో నిరుపమ్ ఎంతో సరదాగా ఉంటాడు. అలానే నిరుపం స్వతహాగా రైటర్ కావడంతో అదిరిపోయే పంచ్ లు, కౌంటర్లు వేస్తూ అందరిని అలరిస్తుంటాడు. అతడి సోషల్ మీడియాలో చేసే పోస్టులు ఎక్కువగా ప్రాసలతో ఉంటాయి. అలానే ఒకవైపు నటిస్తూనే మధ్యలో నిర్మాతగా మారారు. ఓ ఛానల్ లో హిట్లర్ గారి పెళ్ళాం అనే సిరయల్ ను నిర్మించాడు. అందులో తానే హిట్లర్ గా నటించి అందర్ని ఆకట్టుకున్నాడు. ఇలా నిర్మాణ రంగం సైడ్ కూడ నిరుపమ్ సక్సెస్ అయ్యాడు. అతడి భార్య మంజుల కూడా నటిగా బుల్లితెరపై రాణిస్తుంది. చంద్రముఖి సీరియల్ సమయంలో వీరిద్దరి మధ్య ప్రేమించుకుని పెళ్లి చేసుకున్నారు. ఇక పరిటాల నిరుపమ్, పరిటాల శ్రీరామ్ గురించి ఓ ఆసక్తిక వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.
చాలా మంది వీరిద్దరి ఇంటి పేర్లు ఒకటి కావడంతో బంధువులని భావించారు. ఈ విషయంపై నిరుపమ్ ఓ ఇంటర్వ్యూలో క్లారీటి ఇచ్చారు. పరిటాల శ్రీరామ్ కు, తమకు ఎలాంటి రిలేషన్ లేదని నిరుపమ్ క్లారిటీ ఇచ్చారు. అయితే తాజాగా కార్తీక దీపం సీరియల్ టీమ్‌తో కలిసి అనంతపురం టీడీపీ యువనేత పరిటాల శ్రీరామ్ ను నిరుపమ్ పరిటాల కలిశాడు. ఈ మేరకు ఫొటోని షేర్ చేసిన నిరుపమ్.. పరిటాల శ్రీరామ్‌ని రియల్ హీరో అంటూ పొగడ్తల వర్షం కురిపించాడు. పరిటాల శ్రీరామ్ తో నిరుపమ్ దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మరీ.. వైరల్ అవుతోన్న ఈ ఫోటోల పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.