Naresh: నటుడు నరేష్, నటి పవిత్రా లోకేష్‌ల పెళ్లి వార్తల వివాదం అంతకంతకూ ముదురుతోంది. ఇద్దరి పెళ్లి.. నలుగురి జీవితాల్లో గొడవకు దారి తీస్తోంది. ఇటు నరేష్ భార్య, అటు పవిత్రా లోకేష్ భర్త ఈ ఇద్దరిపై తీవ్రమైన వ్యాఖ్యలు చేస్తున్నారు. నరేష్ మూడో భార్య రమ్య.. నరేష్, పవిత్రల పెళ్లి వార్తలపై స్పందిస్తూ.. నరేష్‌తో తన సంబంధాలు ఇంకా తెగిపోలేదని అన్నారు. తాను ఇంకా విడాకుల పేపర్లపై సంతకం చేయలేదని స్పష్టం చేశారు. తమకు ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారని చెప్పారు. నరేష్ పెళ్లి చేసుకుంటే తన గతి ఏంకాను అని ప్రశ్నిస్తున్నారు.
రమ్య చేసిన వ్యాఖ్యలకు నరేష్ కౌంటర్ ఇచ్చారు. నరేష్ మాట్లాడుతూ.. ‘‘ నేను ఇప్పటి వరకు 100కుపైగా మహిళలతో పనిచేశా. ఎక్కడన్నా చూసుకో.. గూగుల్‌లో కూడా తీసుకో.. నేను చీట్ చేశానని, వేధించానని ఎక్కడన్నా ఉందా. మ్యారేజ్ గురించి రావచ్చు. నా మ్యారేజీ ఫేయిల్. వాళ్లు వెళ్లిపోయారు. వాళ్లను నేను ఆపలేదు. ఎందుకంటే.. నేను రాజకీయాల్లో ఉన్నాను. సేవారంగంలో ఉన్నాను. వాళ్ల స్వలాభం కోసంవాళ్లు వెళ్లిపోయారు. రమ్య రఘుపతి నా జీవితంలోకి వచ్చి నా కుటుంబాన్ని నాశనం చేసింది. ఓ పెద్ద ఫ్యామిలీని స్మాష్ చేసింది.
క్రిష్ణ గారు, పెద్ద వాళ్ల దగ్గరకు వెళ్లి 50 లక్షల రూపాయలు డిమాండ్ చేసింది. నేను తట్టుకోలేక.. క్రిష్ణగారు చెబితే 10 లక్షల రూపాయలు ఇచ్చాను. అయినప్పటికి ఆమె ఇంకా నన్ను వదిలిపెట్టడం లేదు. రమ్య.. ఫ్యామిలీ ఫంక్షన్లలలో నువ్వెక్కడ ఉన్నావు. నువ్వు ఎక్కడో ఎవరితోనో ఉన్నావు. అదంతా నేను చెప్పాలనుకోవటం లేదు. పవిత్రా లోకేష్ నా లైఫ్‌లోకి వచ్చి 4 సంవత్సరాలు మాత్రమే అయింది. కానీ, నేను నీతో 8 ఏళ్ల క్రితంనుంచే దూరంగా ఉంటున్నాను’’ అని అన్నారు. మరి, భార్యపై నటుడు నరేష్ చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇవి కూడా చదవండి : Naresh: 4 ఏళ్ళ క్రితమే పవిత్రా లోకేష్ నా జీవితంలోకి వచ్చింది: నరేశ్