రాష్ట్ర రాజకీయాలను తలపించే విధంగా జరిగిన మా ఎన్నికల్లో మంచు విష్ణు ‘మా’ అధ్యక్షుడిగా విజయం సాధించిన విషయం తెలిసిందే. తాజాగా ఫిల్మ్‌నగర్ కల్చరల్ సెంటర్ వేదికగా మా కొత్త కార్యవర్గం కొలువుదీరింది. తనని ఆశీర్వదించాడానికి వచ్చిన ఇండస్ట్రీ పెద్దల సమక్షంలో ‘మా’ అధ్యక్షుడిగా మంచు విష్ణు ప్రమాణం చేశారు. విష్ణు ప్రమాణ స్వీకారోత్సవానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ముఖ్య అతిథిగా హాజరవ్వడం విశేషం. అంతా సవ్యంగా జరిగిపోయిన ఈ వేడుకలో సీనియర్ హీరో మోహన్ బాబు చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ ఆవుతోన్నాయి.
‘మా’ అంటే కళాకారుల కుటుంబం. ఇక్కడ రాజకీయాలకి తావు లేదు. మనం అంతా ఒక్కటే తల్లి బిడ్డలం. ఇక్కడ రాజకీయాలు అవసరమా? 47 ఏళ్ళ నా సినీ జీవితం తెరిచిన పుస్తకం. ఎక్కడా దాపరికాలు లేవు. సీనియర్స్ ని అమితంగా గౌరవించే వ్యక్తిని నేను. యన్టీఆర్, ఏయన్నార్, కృష్ణ, కృష్ణంరాజు లాంటి వారిని మనం ఎప్పటికీ గౌరవిస్తూనే ఉండాలి. కానీ.., ఇప్పుడు సీనియర్ హీరోలకి గౌరవం అందడం లేదు.
ఇకపై అయినా ఇండస్ట్రీలో ఒకరిని ఒకరు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసుకోవద్దు. మీడియాకి ఎక్కవద్దు. ‘మా’ అభివృద్ధికి సహకరించుకుందాం అని మోహన్ బాబు ప్రసంగించారు. అయితే.., సీనియర్స్ కి గౌరవం ఇవ్వని ఆ హీరోలు ఎవరు? మోహన్ బాబు టార్గెట్ చేసింది ఎవరిని అన్న కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మరి.. ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియ చేయండి.