సినీ ఇండస్ట్రీలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. ప్రముఖ నటీనటులు కన్నుమూస్తున్నారు. సినీ ఇండస్ట్రీలో తనదైన కామెడీ టైమింగ్ తో కోట్ల మంది అభిమానులను అలరించిన నటుడు కన్నుమూశారు.. నటుడిగానే కాకుండా స్టార్ హీరోల సినిమాలకు దర్శకత్వం వహించారు.
ఇటీవల సినీ ఇండస్ట్రీలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్న విషయం తెలిసిందే. స్టార్ నటీనటులు, దర్శక, నిర్మాతలు హఠాత్తుగా కన్నుమూయడంతో ఇండస్ట్రీ షాక్ లోకి వెళ్లిపోతుంది. తమ నటనతో కోట్ల మంది అభిమానం సంపాదించిన నటీనటులు కన్నుమూయడం వారికుటుంబ సభ్యులకే కాదు.. అభిమానులు సైతం కన్నీటి సంద్రంలో మునిగిపోతున్నారు. తాజాగా సీనీ ఇండస్ట్రీలో మరో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ హాస్య నటుడు కన్నుమూశారు. వివరాల్లోకి వెళితే..
సినీ ఇండస్ట్రీలో మరో విషాదం చోటు చేసుకుంది. తనదైన హాస్యంతో కోట్ల మంది అభిమానుల మనసు దోచిన నటుడు, దర్శక, నిర్మాత మనోబాల ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. గత కొంత కాలంగా ఆయన కాలెయ సమస్యలతో బాధపడుతూ ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ క్రమంలోనే ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించడంతో కన్నుమూశాడు. ఇండస్ట్రీలో 45 ఏళ్లుగా నటుడు, నిర్మాత, దర్శకుడిగా ఎన్నో సినిమాలు చేశాడు. ఆయన మరణంతో స్టార్ హీరోల దగ్గర నుంచి అభిమానులు ఒక్కసారే దిగ్బ్రాంతికి గురయ్యారు. కుటుంబానికి సానుభూతి తెలియజేశారు.
1979 లో కమల్ హాసన్ ప్రోత్సాహంతో భారతీరాజ్ వద్ద ‘పుతియా వార్పుగల’ మూవీకి అసిస్టెంట్ డైరెక్టర్ గా జాయిన్ అయ్యారు మనోబాల. ఆ తర్వాత పలు చిత్రాల్లో నటుడిగా అవకాశం దక్కించుకున్నాడు. ఓ వైపు సినిమాల్లో నటిస్తూనే దర్శకత్వం వైపు మొగ్గు చూపారు. మనోబాల 1982 లో మొదటిసారిగా ‘ఆగాయి గంగై’ మూవీకి దర్శకత్వం వహించారు. దర్శకుడిగా తమిళ, కన్నడ, హిందీ, భాషల్లో పలు సినిమాలు చేశారు. మనోబాల దర్శకత్వంలో పలువురు స్టార్స్ ఉన్నారు. అందులో ఒకరు సూపర్ స్టార్ రజినీకాంత్. 1987 లో రజినీకాంత్, రాధిక జంటగా ‘ఊర్కవలన్’ అనే యాక్షన్ తరహా మూవీకి దర్శకత్వం వహించారు. ఈ మూవీ అప్పట్లో బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించింది.
ఆనాటి నుంచి మనోబాల, రజినీకాంత్ మద్య మంచి స్నేహం కొనసాగింది. మనోబాల మరణంపై రజినీకాంత్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ‘నా ప్రియమైన స్నేహితుడు, ప్రముఖ నటుడు, దర్శకుడు మనోబాల మరణవార్త విన్న తర్వాత నేను ఎంతో బాధపడ్డాను. అతడి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నా. అతడి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా’అంటూ ట్విట్ చేశారు. రజిననీకాంత్ మాత్రమే కాదు.. కన్నడ సూపర్ స్టార్ దివంగత విష్ణువర్ధన్ తో ఓ మూవీ తీశారు. అలాగే తమిళ స్టార్ హీరో విక్రమ్ తో ‘సిరాగుగల్’ అనే మూవీ తెరకెక్కించారు. ఆయన మృతితో ఇండస్ట్రీ మొత్తం శోక సంద్రంలో మునిగిపోయింది.
பிரபல இயக்குநரும், நடிகருமான, அருமை நண்பர் மனோபாலாவுடைய இறப்பு எனக்கு மிகவும் வேதனை அளிக்கிறது. அவருடைய குடும்பத்தினருக்கு என்னுடைய அனுதாபங்கள். அவரது ஆத்மா சாந்தியடையட்டும்.@manobalam
— Rajinikanth (@rajinikanth) May 3, 2023