గత కొన్ని రోజుల నుంచి నటుడు విజయ్ సేతుపతి దాడి అంశం తీవ్ర చర్చనీయాంశమవుతోంది. అయితే ఏం జరిగిందనే వాస్తవం ఇన్ని రోజులు తెలియక ఒక్కొక్కరు ఒకోలా స్పందించారు. అయితే ముందుగా కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ మరణించటం ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించటానికి విజయ్ వెళ్లలేదనే కోపంతో ఆయన అభిమానులే దాడికి పాల్పడ్డారని వార్తలు వినిపించాయి. ఇక ఇదే కాకుండా ఓ అభిమాని విజయ్ సేతుపతిని సెల్ఫీ అడిగాడని దీనికి ఆయన నిరాకరించటంతోనే దాడికి పాల్పడ్డారంటూ కూడా వార్తలు వచ్చాయి.
ఇక తాజాగా ఇదే అంశంపై స్పందించారు దాడికి పాల్పడ్డ వ్యక్తి నటుడు మహా గాంధీ. దాడి వెనుక ఉన్న అసలు కారణాలు తెలిపాడు. నేను, విజయ్ సేతుపతి ఒకే విమానం లోనే వచ్చాము, జాతీయ అవార్డు సాధించినందుకు కృతజ్ఞతలు చెప్పాను. కానీ విజయ్ సేతుపతి చాలా పొగరుగా ఇదొక దేశమా అని కించపరిచారు. నేను ముత్తురామలింగ దేవర్ భక్తుడిని , ఆయన గురించి అడిగిన అయన ఎవరు అంటూ, కించపరిచారు ,నేను ఒక నటుడిగా అయన నటనకు అభిమానిని కానీ అయన నన్ను పలకరించిన విధానం చాల అవమానకరంగా ఉంది. ఈ కారణంతోనే ఆయనపై దాడిచేశానని తాజాగా ఓ ఇంటర్వ్యూలో నటుడు మహా గాంధీ తెలిపాడు.