కమెడియన్ లక్ష్మిపతి గుర్తు ఉన్నాడా? ఆయన కొడుకు ఇప్పుడు టాలీవుడ్ లో పెద్ద హీరో..!

కమెడియన్ లక్ష్మిపతి గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. తనదైన  కామెడీతో ప్రేక్షకులను కడుబ్బా నవ్వించారు. సినిమాల్లో బిజీగా ఉన్న సమయంలోనే ఆయన మరణించారు. అయితే వాళ్ల అబ్బాయి మాత్రం సినిమా బాగా రాణిస్తున్నాడు.

కమెడియన్ లక్ష్మిపతి గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. తనదైన  కామెడీతో ప్రేక్షకులను కడుబ్బా నవ్వించారు. లేట్ వయులో సినిమాలోకి వచ్చిన కూడా దాదాపు 50కిపైగా చిత్రాల్లో నటించారు. లక్ష్మిపతి యాస, మాటలే ఆయన కెరీర్ కు ప్లస్ అయ్యాయి. ఇక ఈయనకు స్వయంగా ఓ డైరెక్టర్ కి అన్న అవుతాడు. వర్షం వంటి బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన డైరెక్టర్ శోభన్ కి లక్ష్మీపతి అన్న అవుతారు. ఆయన కొడుకు ఇప్పుడు టాలీవుడ్ లో మంచి హీరోగా గుర్తింపు సంపాదించాడు. మరి.. ఈ వివరాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం..

శోభన్ డైరెక్ట్ చేసిన బాబీ సినిమా ద్వారా తెలుగు చిత్ర పరిశ్రమలోలో కమెడియన్ గా లక్ష్మిపతి ఎంట్రీ ఇచ్చారు. తొలి సినిమాతోనే మంచి గుర్తింపు సంపాదించారు. ఆ తరువాత అనేక సినిమాలో నటించి ప్రేక్షకులను మెప్పించారు. ముఖ్యంగా అల్లరి,అమ్మాయిలు అబ్బాయిలు,తొట్టిగ్యాంగ్, పెదబాబు, కితకితలు లాంటి సినిమాలో ఆయన నటించారు. లక్ష్మీపతి మొదటగా టీవీ వ్యాఖ్యాతగా, హాస్యనటుడిగా తన కెరీర్ ను ప్రారంభించాడు. సినిమాల్లో బిజీ గా ఉన్న సమయం లోనే గుండెపోటు రావడం తో మరణించారు.

ఇక ఈయనకి శ్వేతా ,కేతన్ ఇద్దరు పిల్లలు ఉన్నారు. లక్ష్మీపతి తమ్ముడు కుమారుడైన సంతోష్ శోభన్ కి సినిమాల పట్ల ఆసక్తి ఉంది. దీంతో తొలుత గోల్కొండ హై స్కూల్ సినిమాలో విద్యార్థిగా కనిపించాడు.  ఆ తరువాత సంతోష్ శోభన్ పేపర్ బాయ్ సినిమా తో మంచి హిట్ సొంతం చేసుకున్నాడు. ప్రస్తుతం ఉన్న యువ హీరోల మాదిరిగానే రెగ్యులర్ గా సినిమాలు చేస్తూ సంతోష్ శోభన్ బిజీ గా ఉన్నారు. ప్రస్తుతం కొన్ని సినిమాల షూటింగ్స్ తో బిజీ బిజీగా సంతోష్ శోభన్ ఉన్నారు. మరి.. వార్తపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments
SHARE THIS ARTICLE ON
Read Today's Latest moviesNewsTelugu News LIVE Updates on SumanTV

Most viewed