తెలుగు ఇండస్ట్రీలో చాలా తక్కువ మంది తమ విలక్షణ నటుతో ప్రేక్షకులను మెప్పించారు. అలాంటి వారిలో కోటా శ్రీనివాస రావు ఒకరు. ఎలాంటి పాత్ర అయినా పరకాయ ప్రవేశం చేసినట్లు నటిస్తుంటారు.
తెలుగు సినీ పరిశ్రమలో అన్ని పాత్రలతో మెప్పించగలిగే నటులు కొందరే ఉన్నారు. అందులో కోట శ్రీనివాసరావు ముందు వరుసలో ఉంటారు.తండ్రి, విలన్, కమెడియన్ వంటి పాత్రలు చేయలంటే ఆయన తర్వాతే ఎవరైనా. కథకు తగ్గట్టు ఆ పాత్రలో ఒదిగిపోవడం కోట గారు చేసి నిరూపించిన పాత్రలు చాలా ఉన్నాయి. విలనిజం చేస్తునే అందులో కామెడీ చేయడం అతనికే సాధ్యం అయ్యిదని చెప్పవచ్చు. 1978లో మొదటి సినిమా ప్రాణం ఖరీదుతో తన సినీ ప్రస్థానం మొదలుపెట్టారు. ఆ తర్వాత వెనక్కి తిరిగి చూడలేదు. సమరసింహా రెడ్డి, బొంబాయి ప్రియుడు, శుభలగ్నం, గణేష్, ఇడియట్, మళ్లీశ్వరి, ఎవడు, మహర్షి వంటి చిత్రాల్లో నటించారు. తన డైలాగ్ డెలివరీ, మేనరిజంతో ప్రేక్షకులకు మంచి ఎంటర్టైన్మెంట్ ఇస్తారు. తెలుగు, తమిళ, హిందీ, కన్నడ భాషల్లో వందలాది చిత్రాల్లో నటించి అయిన ప్రస్తుతం వృద్దాప్యం సమస్యలతో బాధపడుతున్నారు.
ఓ ఇంటర్వ్యూలో కోటా శ్రీనివాసరావు మాట్లాడుతూ గతంలో జరిగిన కొన్ని ముఖ్య సంఘటనలు గుర్తు చేసుకున్నారు. ‘ఒసారి ఏమైందంటే సెట్ కు వెళ్ళాక మధ్యాహ్నం వరకు షూటింగ్ లేదన్నారు. దీంతో ఏం చేయాలో పాలుపోలేదు.. అదే సమయంలో ఎం.ఎస్ నారాయణ నా దగ్గరకు వచ్చి అన్నా ఏంటీ షూటింగ్ అని చెప్పారు.. తీరా వస్తే లేదని చెబుతున్నారు. సరే మనకు ఇప్పుడు ఎలాగూ టైమ్ ఉంది కదా అలా బయటకు వెళ్దాం అన్నాడు. ఇద్దరం కలిసి అలా సరదాగా బయటకు వెళ్లి మందు తాగాం. అనుకోకుండా షూటింగ్‌కి రమ్మని కబురొచ్చింది. వెంటనే అలర్ట్ అయి మేం షూటింగ్ స్పాట్ కి వెళ్లాము. అక్కడ జరిగిన సంఘటన ఇంకా గుర్తింది’ అన్నారు.
‘నేను ఎమ్మెస్ నారాయణ సెట్ కి వెళ్లాము.. అక్కడ చిరంజీవి ఉన్నాడు. తనకు ఎలా అనుమానం వచ్చిందో తెలియదు కానీ మీరు మందు తాగారా అన్నాడు. చేసేది ఏమీలేక అవును మేము తాగాం అని చేప్పడంతో మమ్మల్ని తిట్టారు. ఇండస్ట్రీలో మీకంటూ మంచి పొజీషన్ ఉంది.. ఇలాంటి సమయంలో మీరు తాగి సినిమా సెట్‌కి రావడం ఏంటి? మిమ్ముల్ని చూసి ఇతర నటులు ఏమనుకుంటారు అని సీరియస్ అయ్యారు. ఆ సమయంలో చిరంజీవి చెప్పింది నా మంచికే అని తెలుసు. నా గురించి మంచిగా ఆలోచించే వారిలో చిరంజీవి ఒకరు. ఇకపోతే తనకు ఆరోగ్య సమస్యలు రావడంతో సినిమాలకు దూరంగా ఉంటున్నా’ అని అన్నారు.