కళ్యాణం వచ్చినా.. కక్కొచ్చినా ఆగదన్నట్లు ఇండస్ట్రీలో ఎవరి పెళ్లి ఎప్పుడు జరుగుతుందో తెలియకుండా జరిగిపోతున్నాయి. ఇదివరకు సెలబ్రిటీల పెళ్లంటే ముందునుండే సోషల్ మీడియాలో హడావిడి ఉండేది. కానీ ఇప్పుడు రోజులు మారిపోయాయి.. టెక్నాలజీ పెరిగిపోయింది. పెళ్లిళ్లు, పేరంటాలన్నీ అయిపోయాక ఒక పోస్ట్ పెట్టి బయటికి చెప్పుకుంటున్నారు. అయితే.. కొన్ని ప్రేమజంటలు మాత్రం ముందుగా చెప్పినట్లుగానే పెళ్లి చేసుకొని గుడ్ న్యూస్ చెబుతున్నాయి.
తాజాగా ప్రముఖ బాలీవుడ్ సీరియల్ యాక్టర్ కరణ్ వి గ్రోవర్.. తన చిరకాల స్నేహితురాలు, నటి పాపీ జబ్బాల్ ను మంగళవారం వివాహం చేసుకున్నాడు. వీరి వివాహ వేడుకకు సంబంధించిన ఫోటోలను కూడా కరణ్ ఇన్ స్టాగ్రామ్‌లో షేర్ చేసాడు. ఇక వీరి పెళ్లికి నటీనటులు రాయ్ లక్ష్మి, షామా సికందర్, సొన్నాల్లి సెగల్ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా కరణ్ పెళ్లి ఫోటోషేర్ చేస్తూ.. “మొత్తానికి 2022 మే 31న మేం ఒక్కటయ్యాం” అని రాసుకొచ్చాడు.
ఇక నూతన వధూవరులకు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు ఫ్యాన్స్, అలాగే తోటి నటీనటులు. ఇదిలా ఉండగా.. కరణ్ – పాపీ జబ్బాల్ మొదటిసారిగా ఓ పార్కింగ్ వద్ద కలుసుకున్నారని.. తర్వాత కామన్ ఫ్రెండ్స్ ద్వారా కలుసుకొని డేటింగ్ స్టార్ట్ చేసినట్లు బాలీవుడ్ వర్గాలు వీరి లవ్ స్టోరీ గురించి చెబుతున్నాయి. ఇద్దరూ చాలాకాలం రిలేషన్ షిప్ లో ఉన్న తర్వాత పెళ్లి చేసుకున్నట్లు తెలుస్తుంది.
కెరీర్ పరంగా కరణ్.. మేరీ ఆవాజ్ కో మిల్ గయీ రోష్నీ, వో రెహ్నే వాలీ మెహ్లాన్ కీ, తేరీ మేరీ లవ్ స్టోరీస్, లఖోన్ మే ఏక్, హమ్ ఆప్కే హై ఇన్ లాస్, గుల్మోహర్ గ్రాండ్ సీరియల్స్ తో పాటు పలు హిందీ టీవీ షోలలో కనిపించాడు. ఇక పాపీ జబ్బల్ నటి మాత్రమే కాదు, మోడల్ కూడా. యాక్టర్ గానే కాకుండా యాంకర్ గా మంచి క్రేజ్ దక్కించుకుంది. ఎన్నో స్పోర్ట్స్ ఈవెంట్స్ కి హోస్ట్‌గా వ్యవహరించింది. ఇటీవలే ‘బ్రోకెన్ బట్ బ్యూటిఫుల్’ వెబ్ సిరీస్ లో మెరిసింది. నటిగా మహి NRI, ఉడాఐడా అనే పంజాబీ సినిమాలలో నటించింది. చత్తీస్‌గఢ్ లోని భిలాయ్‌లో పుట్టి పెరిగిన జబ్బాల్.. 2019లో ‘గ్లాడ్రాగ్స్ మెగా మోడల్ మాన్‌హంట్’లో పాల్గొని ‘బెస్ట్ బాడీ’ టైటిల్ గెలుచుకుంది. మరి కరణ్-పాపీ జబ్బాల్ ల జంటపై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.