ట్వీట్స్ తో ప్రపంచాన్ని తన వైపు తిప్పుకోవడంలో ఎలాన్ మస్క్ ఎలాగో.. తన మార్క్ క్రిటిసిజం ద్వారా సినీ ప్రేక్షకులను తన వైపు తిప్పుకోవడంలో కమల్ రషిద్ ఖాన్ అలియాస్ కేఆర్కే ఒకరు. ఇతడు గతంలో కొన్ని సినిమాలు సైతం చేశాడు. ప్రస్తుతం సినిమా రివ్యూలతో బాలీవుడ్ లో తన కంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నాడు. ట్విట్టర్ వేదికగా ఏ హీరో అని కూడా చూడకుండా కేఆర్కే ట్వీట్స్ చేస్తాడు. తాజాగా అతడిని ముంబై పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ వార్తకు సంబంధించి మరిన్ని వివరాల్లోకి వెళితే..
KRK..కమల్ రషీద్ ఖాన్.. బాలీవుడ్ లో ఏ సినిమా రిలీజ్ అయినా సరే తన దైన మార్క్ క్రిటిక్ తో ఆ సినిమాని చిల్చీ చండాడటం అతడికి అలవాటు. ఈ క్రమంలోనే 2020లో అతడు చేసిన ట్వీట్ పై బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ కేఆర్కే పై కేసు వేశాడు. సల్మాన్ మూవీ అయిన ‘రాధే’ సినిమా అస్సలు బాలేదని, డిజాస్టర్ అని ట్విట్ లు చేయడమే కాకుండా తన పరువు కు నష్టం కలిగేలా మాట్లాడాడు అంటూ సల్మాన్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
అదీకాక 2020లో కరోనా కారణంగా బాలీవుడ్ ప్రముఖులు ఇర్పాన్ ఖాన్, రిషీ కపూర్ లను ఉద్దేశించి చేసిన ట్వీట్స్ అప్పట్లో దూమారం లేపాయి. దీంతో ఆ ట్వీట్స్ కారణంగా తాజాగా అతడిని అరెస్ట్ చేశారు. మరో ప్రముఖ నటుడు మనోజ్ బాజ్ పాయి గతంలో కేఆర్కే పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. మనోజ్ నటించిన సూపర్ హిట్ వెబ్ సిరీస్ ‘ది ఫ్యామిలీ మ్యాన్’ సిరీస్ ను కేఆర్కే ‘సాఫ్ట్ పోర్న్’ సిరీస్ గా పేర్కొన్నాడు. అదీ కాక విడుదలై బాక్సఫీస్ వద్ద భారీ వసూళ్ల వర్షం కురిపించిన సినిమాలను సైతం డిజాస్టర్స్ గా పేర్కొనడం కేఆర్కేకు అలవాటు.
ఈ నేపథ్యంలోనే గతంలో అతడి పై ఫిర్యాదు చేసిన కేసుల నేపథ్యంలో అతడిని తాజాగా ముంబై ఎయిర్ పోర్టు లో అరెస్ట్ చేయడం జరిగిందని మలద్ పోలీసులు తెలిపారు. అతడిని ఈ రోజే బోరివలీ కోర్టులో హాజరుపరచనున్నట్లు పోలీసులు తెలిపారు. అయితే కమల్ అరెస్ట్ పై నెట్టింట మీమ్స్, ట్రోల్స్ తెగ సందడి చేస్తున్నాయి. మరి ట్వీట్టర్ వేదికగా సినిమాలపై విరుచుకుపడే కేఆర్కే అరెస్ట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
This Pathetic KRK is arrested. Look at his disgusting tweets that he tweeted back in 2020.#KRKArrested pic.twitter.com/2I4IR3Ooqt
— Karan Raghav 🇮🇳 (@krnraghav) August 30, 2022
Maharashtra | Kamal Rashid Khan arrested by Malad Police over his controversial tweet in 2020. He was arrested after he landed at Mumbai Airport. He will be presented before Borivali Court today: Mumbai Police
(Pic – Khan’s Twitter account) pic.twitter.com/7gjG3sZ43G
— ANI (@ANI) August 30, 2022
Scene from Mumbai Airport 😂#KRKArrested #KamalRashidKhanpic.twitter.com/yiromBumZT
— Devil V!SHAL (@VishalRC007) August 30, 2022