ఇండియన్ సినీ ఇండస్ట్రీలో ఇప్పటి వరకు ఎన్నో బయోపిక్స్ వచ్చాయి. తెలుగులో ఎన్ని బయోపిక్స్ వచ్చినా.. ఆ మద్య రిలీజ్ అయిన ‘మహానటి’ అద్భుతమైన విజయం అందుకుంది. ఆ తర్వాత యన్టీఆర్ బయోపిక్ రెండు భాగాలు రిలీజ్ అయ్యింది. ఇక ఏపీ దివంగత నేత వైఎస్ రాజశేఖర్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ‘యాత్ర’ అద్భుతమైన విజయం అందుకుంది.
తెలుగు ఇండస్ట్రీలో ఇప్పటి వరకు ఎన్నో బయోపిక్ చిత్రాలు వచ్చాయి. మహి.వి రాఘవన్ దర్శకత్వంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవిత కథ ఆధారంగా రూపొందిన ‘యాత్ర’ చిత్రం అద్భుత విజయం సాధించింది. వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాత్రలో మాలీవుడ్ మెగాస్టార్ మమ్ముట్టి నటించారు. 2019, ఫిబ్రవరి 8 న రిలీజ్ అయిన ఈ చిత్రం అప్పట్లో వైసీపీకి ఎన్నికల్లో ప్రధాన ఆస్త్రంగా నిలిచిందని అంటారు. ఇటీవల యాత్ర 2 మూవీకి శ్రీకారం చుట్టబోతున్నారని సోషల్ మీడియాలో తెగ వార్తలు వస్తున్నాయి. వివరాల్లోకి వెళితే..
మహి వి రాఘవన్ దర్శకత్వంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవిత కథ ఆధారంగా రూపొందిన మూవీ `యాత్ర` . 2019 లో రిలీజ్ అయిన ఈ చిత్రానికి ఎంతో గొప్పగా ప్రేక్షకాధరణ లభించింది. వైఎస్ పాత్రలో మాలీవుడ్ మెగాస్టార్ మమ్ముట్టి అద్భుతంగా నటించారు. అప్పట్లో ఈ మూవీ ప్రభావం ఎన్నికలపై బాగాపడిందని అంటారు. ఒకదశలో పార్టీకి వైస్ అభిమానులను మరింత చేరువ చేయడంలో ఈ మూవీ కీలక పాత్ర పోషించిందని అంటారు. ఇప్పుడు అలాంటి సీన్ రిపీట్ కాబోతుందని.. 2024 ఎలక్షన్స్ దగ్గరపడుతున్న నేపథ్యంలో ‘యాత్ర 2’ తెరపైకి తీసుకు రావాలని దర్శకుడు మహి వి. రాఘవన్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. యాత్ర వైఎస్ పాదయాత్ర నేపథ్యంలో సాగితే.. ‘యాత్ర 2’ వైఎస్ జగన్ ప్రధానంగా సాగబోతుందని ఫిలిమ్ వర్గాల్లో టాక్.
గతంలో ‘యాత్ర 2 ’ జగన్ బయోపిక్ లో తమిళ స్టార్ హీరో సూర్య నటించే అవకాశం ఉందని వార్తలు వచ్చాయి. తాజాగా జగన్ పాత్రలో ‘రంగం’ మూవీతో తెలుగులో మంచి గుర్తింపు తెచ్చుకున్న నటుడు జీవా నటించనున్నాడని ఇండస్ట్రీలో టాక్ నడుస్తుంది. ఇటీవలే మహి వి రాఘవన్ ఈ మూవీకి సంబంధించిన స్క్రిప్ట్ పనులో ప్రారంభించినట్లు తెలుస్తుంది. ఈ మూవీకి సంబంధించిన స్టోరీ పక్కగా పూర్తయిన తర్వాత వివరాలన్నీ అధికారికంగా తెలియజేస్తానని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తెలిపారు మహి వి రాఘవన్. 2024 ఎన్నికలకు ముందే ఈ మూవీ కంప్లీట్ చేసి ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చే ప్లాన్ లో ఉన్నట్లు సమాచారం. ఇక ఈ మూవీలో జగన్ కథ మొత్తం చూపిస్తారా? కేవలం పాదయాత్ర లోని హైలెట్స్ మాత్రమే చూపిస్తారా? అనేది ఆసక్తిగా మారింది. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ నుంచి ప్రకటన మాత్రం అఫిషియల్ గా రాలేదు.
తొందరలో తమిళ్ లో జగనన్న ఆటోబయోగ్రఫి..@ncbn @JaiTDP @naralokesh
జీవా లీడ్ రోల్.. ఇదిరా జగనన్న దమ్ము..🦁🔥💪💪#Jeeva #Kollywood #CMYSJagan #TamilNadu #Tollywood #YSJagan pic.twitter.com/usUIy57lVT
— YSJ_🦁_2024 (@jagun_ys) May 4, 2023