తాజాగా చిత్ర పరిశ్రమ మరో ప్రముఖ వ్యక్తిని కోల్పోయింది. సీనియర్ నటుడు జయంత్ సావర్కర్ కన్నుమూశారు. ఆయన వయసు 87 సంవత్సరాలు. వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న ఆయన థానేలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు.
సినీ పరిశ్రమలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఇటీవల కాలంలో చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖులు కొందరు వివిధ కారణాలతో కన్నుమూశారు. మరి కొందరు ప్రమాదాలకు గురయ్యారు. దీంతో సినీ వర్గాల వారు ఏ సమయంలో ఎలాంటి దుర్వార్త వినాల్సి వస్తుందోనని ఆందోళన చెందుతున్నారు. ఇటీవల చార్లీ చాప్లిన్ కుమార్తె ప్రముఖ నటి జోసెఫిన్ చాప్లిన్ మరణించిన వార్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తాజాగా చిత్ర పరిశ్రమ మరో ప్రముఖ వ్యక్తిని కోల్పోయింది. సీనియర్ నటుడు జయంత్ సావర్కర్ కన్నుమూశారు. ఆయన వయసు 87 సంవత్సరాలు. వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న ఆయన థానేలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు.
జయంత్ ఎక్కువగా హిందీ, మరాఠీ సినిమాల్లో నటించారు. అలాగే దాదాపు ఆరు దశాబ్దాల పాటు టెలివిజన్ రంగంలోనూ పని చేశారు. మొదట మరాఠీ ఇండస్ట్రీలో బ్యాగ్రౌండ్ ఆర్టిస్ట్‌గా కెరీర్ ప్రారంభించారాయన. ప్రముఖ నాటక రచయిత విజయ్ టెండూల్కర్ రూపొందించిన ‘మనుస్ నవాచే బెట్’ అనే నాటికలో అవకాశం రావడంతో ఆయన కెరీర్ ఊపందుకుంది. ‘హరి ఓం విఠల’, ‘గద్బద్ గోంధాల్’, ‘66 సదాశివ్’, ‘బకాల్’, ‘యుగ్ పురుష్’, ‘వాస్తవ్’, ‘సింగం’ వంటి చిత్రా్ల్లో కనిపించారు.
ఆయనకు భార్య, ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. కొద్ది రోజుల క్రితం బీపీకి గురి కావడంతో ఆసుపత్రిలో చేర్చామని, వెంటిలేటర్‌పై ఉంచి చికిత్సనందిస్తున్నారని, ఆదివారం (జూలై 3) రాత్రి ఆరోగ్యం క్షీణించడంతో సోమవారం (జూలై 24) ఉదయం 11 గంటలకు తుదిశ్వాస విడిచారని ఆయన కుమారుడు కౌస్తుభ్ సావర్కర్ తెలియజేశారు. మంగళవారం ఉదయం అంత్యక్రియలు నిర్వహించనున్నారు. హిందీ, మరాఠీ సినీ ప్రముఖులు జయంత్ ఆత్మకు శాంతికలగాలంటూ నివాళులర్పిస్తున్నారు.