తెలుగునాట క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, యాంకర్ గా, మాజీ బిగ్ బాస్ కంటెస్టెంట్ గా నటి హిమజ మంచి ఫాలోయింగ్ దక్కించుకుంది. ఇక తన సొంత యూట్యూబ్ ఛానెల్ లో వీడియోస్ చేస్తూ ఈమె నిత్యం ట్రెండింగ్ లో ఉంటుంది. అయితే.., ఇంత క్రేజ్ వచ్చాక హిమజపై గాచిప్స్ రావడం మొదలయ్యాయి. తాజాగా.. నటి హిమజ పెళ్లి, విడాకులపై గాచిప్స్ పుట్టుకొచ్చాయి. దీంతో.. తాజాగా నటి హిమజ ఈ వార్తల విషయంలో క్లారిటీ ఇచ్చింది.
ఇది కూడా చదవండి:
ఐపీఎస్ అంకిత శర్మ.. చత్తీస్‌గఢ్ అడవుల్లో లేడీ సింగం!
నటి హిమజ ఇప్పటికే రెండు పెళ్లిళ్లు చేసుకుందని, ఇప్పుడు రెండో భర్తకి కూడా విడాకులు ఇవ్వడానికి హిమజ సిద్ధమవుతోందని సోషల్ మీడియాలో విపరీతంగా గాచిప్స్ ప్రచారం అయ్యాయి. దీంతో.. హిమజ తన ఇన్ స్టా వేదికగా కెమెరా ముందుకి వచ్చింది. “నాపై ఇలాంటి వార్తలు ఎందుకు పుట్టిస్తున్నారో అర్ధం కావడం లేదు. అయినా.. నేను ఇలాంటి వాటికి బెదిరే రకం కాదు. కానీ.. ఎలాంటి ఆధారం లేని ఇలాంటి గాచిప్స్ నా కుటుంబ సభ్యలను కంగారు పెడుతున్నాయి. ఈ విషయంలో నా వెల్ విషర్స్ అంతా నాకు అండగా నిలబడ్డారు.
ఇలాంటి గాలి వార్తలు సృష్టించే వారికి నాది ఒక మనవి. దయచేసి నా పెళ్ళికి నన్ను పిలవండి. అలాగే నా విడాకులకు కూడా నన్ను పిలవండి. అదేంటో యూట్యూబ్ లోనే పెళ్ళిళ్ళు చేసేస్తున్నారు. యూట్యూబ్ లోనే డైవర్స్ కూడా ఇచ్చేస్తున్నారు. నాకేం అర్థం కావడం లేదు” అంటూ హిమజ కాస్త ఎమోషనల్ అయ్యారు. మరి.. ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.