Viral Video: ఈ మధ్య కాలంలో సినిమా వాళ్ల మీద సామాన్య జనం చేస్తున్న దాడులు పెరిగి పోయాయి. కళాకారులన్న విచక్షణ లేకుండా వారితో దురుసుగా ప్రవర్తిస్తున్నారు కొందరు మూర్ఖులు. టాలీవుడ్‌నుంచి హాలీవుడ్ వరకు అన్ని చోట్లా ఇదే పరిస్థితి దాపురించింది. తాజాగా, ఓ ప్రముఖ హాలీవుడ్ నటుడికి చేదు అనుభవం ఎదురైంది. స్టేజిపై పాటలు పాడుతున్న అతడ్ని ఓ వ్యక్తి బాటిల్‌తో కొట్టాడు. సరిగ్గా నటుడి ప్రైవేట్ పార్టుపై కొట్టడంతో అతడు విలవిల్లాడిపోయాడు. కొద్దిసేపు మాట్లాడలేకపోయాడు. ఇంతకీ ఏం జరిగిందంటే… ఇంగ్లాండ్‌కు చెందిన సింగర్, నటుడు హ్యారీ స్టైల్స్ శుక్రవారం చికాగోలో ఓ మ్యూజిక్ ప్రోగ్రామ్ నిర్వహించారు. హ్యారీ కోసం అతడి అభిమానులతో పాటు మ్యూజిక్ అభిమానులు కూడా పెద్ద ఎత్తున అక్కడికి వచ్చారు.
హ్యారీ కూడా వారిని తన పాటతో ఊర్రూతలూగించాడు. కొద్ది సేపటి తర్వాత అతడు పాటలు పాడటం ఆపాడు. చుట్టూ ఉన్న వారిని చూస్తూ మాట్లాడటం మొదలు పెట్టాడు. ఈ నేపథ్యంలోనే ఓ వ్యక్తి అతడిపై బాటిల్ విసిరాడు. ఆ బాటిల్ వెళ్లి సరిగ్గా హ్యారీ ప్రైవేట్ పార్టును తాకింది. గట్టిగా తగిలినట్లు ఉంది పాపం.. నొప్పితో గిలగిల్లాడిపోయాడు. కొద్దిసేపు కిందకు వంగిపోయి అల్లాడాడు. తర్వాత తేరుకుని పాటలు పాడటం కొనసాగించాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వీడియోపై స్పందిస్తున్న నెటిజన్లు హ్యారీపై దాడి చేసిన వ్యక్తిపై మండిపడుతున్నారు. అతడ్ని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు.
LOL right in the sweet spot pic.twitter.com/kCvhCroHgJ
— 𝑮𝒂𝒃𝒓𝒊𝒆𝒍𝒂 𝑹𝒐𝒔𝒆 (@glambygab) October 15, 2022