దేశంలోకి కరోనా మహమ్మారి ఎప్పుడైతే ఎంటర్ అయ్యిందో.. అప్పటినుండి సినీ ఇండస్ట్రీలో బ్యాచిలర్లుగా ఉన్న స్టార్స్ అంతా పెళ్లి పీటలెక్కి తీపి కబురు వినిపిస్తున్నారు. కరోనాకి ముందు సెలబ్రిటీల పెళ్లిళ్ల సంఖ్య ఎంత ఉందోగాని, కరోనా వచ్చాక మాత్రం ఇండస్ట్రీలో పెళ్లిళ్ల సంఖ్య భారీగానే నమోదైంది. తాజాగా మరో దక్షిణాది స్టార్ యాక్టర్ పెళ్లి చేసుకొని వార్తల్లో నిలిచాడు.
తెలుగుతో పాటు సౌత్ భాషలన్నింటిలో తన నటనతో మెప్పిస్తున్న హరీష్ ఉత్తమన్.. మలయాళీ నటి చిన్ను కురువిల్లను రెండో పెళ్లి చేసుకున్నాడు. కేరళ మవెలిక్కరలోని రిజిస్ట్రార్ ఆఫీస్ లో వీరి పెళ్లి జరగగా.. కరోనా నిబంధనల దృష్ట్యా ఈ పెళ్లి వేడుకకు ఇరు కుటుంబ సభ్యులు, సన్నిహితులు, స్నేహితులు మాత్రమే హాజరైనట్లు తెలుస్తుంది.
అనంతరం రిజిస్ట్రార్ ఆఫీస్ ముందు సంప్రదాయ పెళ్లి దుస్తుల్లో నిలబడిన హరీష్, చిన్ను ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ సందర్భంగా సినీ అభిమానులు, నెటిజన్లు కొత్త దంపతులకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఇక హరీష్ గతంలో అమృత కళ్యాణపూర్ ని మొదటి పెళ్లి చేసుకొని, కొద్దీకాలానికే ఆమెతో విడిపోయాడు.
Happy Married life #HarishUthaman ❤️ #ChinnuKuruvila pic.twitter.com/lsaYAlOQ0k
— Plumeria Movies (@plumeriamovies) January 20, 2022
ఇక హరీష్ తెలుగులో శ్రీమంతుడు, నాంది లాంటి సినిమాలతో మంచి గుర్తింపు తెచుకున్నాడు. మరోవైపు చిన్ను కురివిల్ల మలయాళంలో పలు సినిమాల్లో నటించింది. ప్రస్తుతం మలయాళం ఇండస్ట్రీలో ఆపరేటివ్ కెమెరా ఉమెన్ గా వర్క్ చేస్తోంది. కొంతకాలంగా ఈ ఇద్దరూ ప్రేమించుకొని పెళ్లితో ఒక్కటయ్యారు. మరి ఈ కొత్త జంట పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.