ఇటవల సినీ పరిశ్రమలో వరుసగా విషాదాలు జరుగుతూనే ఉన్నాయి. సినీ నటులు, దర్శక, నిర్మాతలు, మ్యూజిక్ డైరెక్టర్లు, రచయితలు ఇలా అన్ని రంగాలవారు కన్నుమూయడంతో ఇండస్ట్రీలో తీవ్ర విషాదం నెలకొంటుంది.
ఇటీవల సినీ ఇండస్ట్రీలో విషాదకర సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి. ప్రముఖ నటీనటులు, దర్శక, నిర్మాతలతో పాటు ఇతర సాంకేతిక వర్గానికి చెందిన వారు చనిపోతున్నారు. దీంతో వారి కుటుంబాల్లోనే కాదు.. అభిమానులు సైతం శోకసంద్రంలో మునిగిపోతున్నారు. బాలీవుడ్ లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. సీనియర్ నటుడు హరీష్ మగోస్ కన్నుమూశారు.
బాలీవుడు చిత్ర పరిశ్రమలో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ బాలీవుడ్ సీనియర్ నటుడు హరీష్ మాగోస్ (76) తుదిశ్వాస విడిచారు. గత కొంత కాలంగా ఆయన ఆరోగ్యపరిస్థితి బాగాలేదు. ఈ క్రమంలోనే జులై 1 రాత్రి సమయంలో ఆయన మరణించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. హరీష్ మృతికి గల కారణాలు తెలియరాలేదు. ఆయన వృద్దాప్య, అనారోగ్య కారణాల వల్ల చనిపోయి ఉంటారని సన్నిహితులు చెబుతున్నారు. ఈ విషయాన్ని బాలీవుడ్ సినిమా అండ్ టీవీ అసోసియేషన్ వారు ఆయన మరణాన్ని ధృవీకరిస్తూ.. సంతాపం తెలియజేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. హరీష్ మాగోస్ 1946 డిసెంబర్ 6న బాంబే ప్రెసిడెన్సీలో జన్మించారు. పూనే ఫిలిం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా నుంచి గ్రాడ్యూయేషన్ పొందారు.
హరీష్ మాగోస్ బాలీవుడ్ లో ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించారు. ఎక్కువగా ఆయన అమితాబ్ బచ్చన్ మూవీస్ లో నటించారు. గోల్ మాల్, నమక్ హలాల్, ఇంకార్, ఖుష్బూ, చుప్కె చుప్కె, సెహన్షా లాంటి బ్లాక్ బస్టర్ మూవీస్ లో హరీష్ మాగోస్ నటించారు. ఆయనకు భార్య, కొడుకు సిద్దార్థ్, కూతురు ఆరుషీ ఉన్నారు. కొంతకాలం ముంబాయిలో హరీష్ మాగోస్ తన పేరుమీద ఓ యాక్టింగ్ స్కూల్ నడిపించారు. హరీష్ నటించిన చివరి చిత్రం ఏ మహబాత్ 1997 లో రిలీజ్ అయ్యింది. ఆ తర్వాత నటనకు పూర్తిగా గుడ్ బై చెప్పారు. హరీష్ మృతి పట్ల సినీ ప్రముఖులు, విద్యార్థులు సంతాపాన్ని తెలియజేశారు.
CINTAA expresses its condolences on the demise of Harish Magon
(Member since JUNE. 1988)
.#condolence #condolencias #restinpeace #rip #harishmagon #condolencemessage #heartfelt #cintaa pic.twitter.com/qMtAnTPThX— CINTAA_Official (@CintaaOfficial) July 1, 2023