ప్రస్తుతం ప్రేక్షకులు సినిమాలను చూసే తీరుమారింది. దాంతో ప్రేక్షకుల అభిరుచులకు అనుగుణంగానే దర్శకులు కూడా సినిమాలు తీసే పంథాను మార్చుకున్నారు. ఇక ఎప్పటికప్పుడు తనను తాను కొత్తగా చూపించుకోవాలనుకునే నటులలో హీరో ధనుష్ ముందు వరుసలో ఉంటారు. తాజాగా ధనుష్ హీరోగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘సార్’ దేశ విద్యా వ్యవస్థలో నెలకొన్న సమస్యలను ప్రస్తావిస్తూ సందేశాత్మకంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. తాజాగా బుధవారం ఈ సినిమా ట్రైలర్ ను విడుదల చేశారు.
‘సార్’.. ధనుష్ హీరోగా సంయుక్తా మేనన్ హీరోయిన్ గా రూపొందుతున్న చిత్రం. ఈ చిత్రానికి వెంకీ అట్లూరి దర్శకత్వం వహిస్తుండగా.. సితారా ఎంటర్ టైన్ మెంట్, ఫార్చ్యూన్ సినిమాస్ కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఇక తాజాగా విడులైన ఈ సినిమా ట్రైలర్ అంచనాలను రేకెత్తించే విధంగా ఉంది. దేశంలోని విద్యా వ్యవస్థ ఏవిధంగా ఉందో అద్దం పట్టేలా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఇక ట్రైలర్ లో విద్యా వ్యవస్థను అడ్డం పెట్టుకుని ఏవిధంగా బిజినెస్ చేస్తున్నారో డైలాగ్స్ లోనే చూపించారు మేకర్స్.
”క్వాలిటీ ఎడ్యూకేషన్ కావాలంటే కాసులు పెట్టాలి.. డబ్బులున్న వాడు కొంటాడు, డబ్బులేని వాడు అప్పు చేసైనా కడతాడు” ఎడ్యూకేషన్ లో వచ్చినంత డబ్బు పాలిటిక్స్ లో రాదు” డబ్బు ఎలాగైనా సంపాదించుకోవచ్చు.. కానీ మర్యద చదువు మాత్రమే సంపాదించి పెడుతుంది” లాంటి డైలాగ్స్ ఆలోచింపజేస్తున్నాయి. ఇక ఈ చిత్రానికి సంగీతం జీవీ ప్రకాశ్ అందిస్తున్నాడు. ఈ చిత్రంలో సాయికుమార్, సముద్రఖని, తనికెళ్ల భరణి, హైపర్ ఆది తదితరులు కీలక పాత్రల్లో నటించారు. ఫిబ్రవరి 17న వరల్డ్ వైడ్ గా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.