Brahmaji: తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు ‘బ్రహ్మాజీ’. టాలీవుడ్‌లో 30 ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పుకోవటానికి వీలున్న అతి కొద్ది మంది నటుల్లో ఈయన ఒకరు. ఇక, బ్రహ్మాజీ 1986లో వచ్చిన ‘మన్నెంలో మొనగాడు’ సినిమాతో తెలుగు తెరపైకి తెరంగేట్రం చేశారు. ప్రముఖ వర్సంటైల్ డైరెక్టర్ కృష్ణ వంశి దర్శకత్వం వహించిన ‘గులాబి’ సినిమాలో ఓ కీ రోల్ చేసి మంచి పేరు తెచ్చుకున్నారు. ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ బిజీబిజీగా గడుపుతున్నారు.
ఇక, బ్రహ్మాజీ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటారు. తనకు సంబంధించిన విషయాలను అభిమానులతో పంచుకుంటూ ఉంటారు. తన అభిప్రాయాలను కూడా తెలియజేస్తుంటారు. తాజాగా, బ్రహ్మాజీ ఓ నెటిజన్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసు పెడతానంటూ వార్నింగ్ ఇచ్చారు. అయితే, సీరియస్‌గా మాత్రం కాదు. ఫన్నీగానే.. ఇంతకీ ఏం జరిగిందంటే.. ట్విటర్‌లో ఓ అభిమాని బ్రహ్మాజీని ‘‘అంకుల్’’ అని సంబోధించాడు. దీంతో ఆయన దానిపై స్పందిస్తూ..
‘‘ అంకుల్ ఏంట్రా.. అంకుల్.. కేసు వేస్తా.. ఏజ్.. బాడీ.. షేమింగా..’’ అంటూ ఫన్నీగా వార్నింగ్ ఇచ్చారు. ప్రస్తుతం బ్రహ్మాజీ స్పందన సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీనిపై నెటిజన్లు స్పందిస్తూ.. ‘‘ మీరు ఎన్ని కేసులు వేస్తానని చెప్పినా, ఫలానా ఆంటీ గారికి వచ్చినంత అటెన్షన్ మాత్రం మీకు రాదు బ్రహ్మాజీ గారు’’.. ‘‘ వేసేయండి బ్రహ్మాజి గారు. లేదంటే స్వీట్ సిక్స్‌టీన్‌ను పట్టుకుని అంకుల్ అంటారా.. అంకుల్’’.. ‘‘ అంకులా మజాకా!’’ అంటూ కామెంట్లు చేస్తున్నారు.
Uncle entra.. uncle u.. case vestha.. age.. body.. shaming aa.. 😜 https://t.co/9fbRbXirbJ
— Brahmaji (@actorbrahmaji) August 30, 2022
ఇవి కూడా చదవండి : ఆ అపరాధ భావన నన్ను వేధిస్తోంది! కాజల్..
మీరు ఎన్ని కేసులు వేస్తానని చెప్పినా, ఫలానా ఆంటీ గారికి వచ్చినంత అటెన్షన్ మాత్రం మీకు రాదు బ్రహ్మాజీ గారు😜😂 pic.twitter.com/c8NjwDhhuH
— Mr.Balu™ (@TheBaluu) August 30, 2022
Veseyyandi brahmaji garu ledante sweet sixteen ni pattukoni uncle antara uncle pic.twitter.com/xJIIUDORrn
— ༒🅛🅤🅒🅚🅨༒ (@Lucky_R0708) August 30, 2022