సినీ పరిశ్రమలో.. ఏ ఇద్దరు సన్నిహితంగా ఉన్నా సరే.. వారి మధ్య ఏదో నడుస్తుంది అంటూ జోరుగా పుకార్లు ప్రచారం అవుతాయి. ఇలాంటి వార్తల వల్ల సదరు సెలబ్రిటీలు ఎంతో ఇబ్బంది పడతారు. కానీ గ్లామర్ ఫీల్డ్‌లో ఇవన్ని కామన్ కాబట్టి.. ఎవరిని ఏమి అనలేరు. తాజాగా ఓ నటుడు.. గతంలో తనపై వచ్చిన ఇలాంటి వార్తలపై క్లారిటీ ఇచ్చాడు. ఆ వివరాలు..
ఎంపీ రవి కిషన్ అంటే వెంటనే గుర్తు పట్టలేరు. అదే అల్లు అర్జున్ హీరోగా నటించిన ‘రేసుగుర్రం’ విలన్ మద్దాలి శివా రెడ్డి అంటే.. చిన్నారులు సైతం టక్కున గుర్తు పడతారు. ఆ పాత్ర ద్వారా తెలుగులో మంచి గుర్తింపు తెచ్చుకున్న రవి కిషన్.. వాస్తవానికి భోజ్‌పురిలో స్టార్ యాక్టర్. ప్రస్తుతం ఆయన గోరఖ్‌పూర్ నుంచి బీజేపీ తరపున ఎంపీగా గెలిచారు. అనేక బాలీవుడ్ సినిమాల్లో పనిచేసిన రవి కిషన్.. తెలుగులో దాదాపు పదికి పైగా సినిమాల్లో విలన్ పాత్రల్లో నటించి మెప్పించారు. ఇక తాజాగా రవి కిషన్ ఇంటర్వ్యూ ఒకటి తెగ వైరలవుతోంది. దీనిలో ఆయన పలు ఆసక్తికర అంశాలు వెల్లడించాడు. ఇక తన వ్యక్తిగత జీవితంలో చోటు చేసుకున్న సంఘటనల గురించే కాక.. గతంలో తనకు, నగ్మాకు ఎఫైర్ నడించింది అనే వార్తలపై కూడా తాజాగా ఈ ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చాడు రవి కిషన్. ఆయన చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్‌గా మారాయి. ఆ వివరాలు..
ఒకప్పుడు దక్షిణాదిలో స్టార్ హీరోలకు జంటగా నటించి గ్లామరస్ హీరోయిన్‌గా పేరు తెచ్చుకుంది నగ్మా. ఆమె సౌత్‌లోనే కాక భోజ్‌పురిలో కూడా అనేక చిత్రాల్లో నటించింది. ఎక్కువగా రవి కిషన్‌కు జోడిగా చేసింది. దాంతో వీరిద్దరి మధ్య రిలేషన్ ఉందనే పుకార్లు జోరుగా ప్రచారం అయ్యాయి. భార్య ప్రీతి శుక్లా కారణంగా వీరిద్దరూ విడిపోయారంటూ గతంలో అనేక వార్తలు వచ్చాయి. అయితే అప్పట్లో వీటిపై స్పందించని రవి కిషన్ తాజాగా క్లారిటీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘నేను-నగ్మా కలిసి చాలా చిత్రాల్లో నటించాం. అందువల్లే ఇలాంటి రూమర్లు పుట్టుకొచ్చాయి. మేమిద్దరం చేసిన సినిమాల్లో చాలా వరకు బ్లాక్‌బస్టర్ హిట్ అయ్యాయి. దాంతో మా జోడిని నిర్మాతలు ఎక్కువగా ప్రిఫర్ చేసేవారు’’ అన్నారు.
‘‘అయితే అందరూ అనుకున్నట్లు మా మధ్య ఎలాంటి రిలేషన్ లేదు. ముందు నుంచి మేమిద్దరం మంచి స్నేహితులం. ఆ కారణంగానే చాలా సినిమాల్లో కలిసి నటించాం. నేను సినిమాల్లో చేసే సమయానికే నాకు పెళ్లయ్యింది. పైగా నా భార్యను నేను చాలా గౌరవిస్తా. ఇప్పటికీ ఆమె కాళ్లు మొక్కుతుంటా. ఎందుకంటే నేను జీరోగా ఉన్నప్పటి నుంచి కూడా తను నాతోనే ఉంది. అయితే వరుస సక్సెస్‌లు సాధించిన తర్వాత నాకు గర్వం పెరిగిందిన. అదే టైమ్‌లో బిగ్ బాస్ రియాలిటీ షోకు వెళ్లాల్సిందిగా నా భార్య సూచించింది. నిజానికి నేను చాలా అయిష్టంతో ఆ షోకి వెళ్లాను. కానీ 3 నెలలు హౌజ్‌లో గడిపిన తర్వాత నాలో చాలా మార్పొచ్చింది. నేను మరింత పాపులర్ కావడమే కాకుండా వ్యక్తిగా ఎంతో మారిపోయా. అప్పటి నుంచి నా భార్యా పిల్లలను బాగా చూసుకుంటున్నా’’ అని చెప్పుకొచ్చాడు రవికిషన్.
ఇక రవి కిషన్ తెలుగులో సినిమాల విషయానికొస్తే.. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కిన ‘రేసు గుర్రం చిత్రంతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఇందులో అల్లు అర్జున్‌కి ప్రతి నాయకుడు మద్దాలి శివారెడ్డి పాత్రలో ఆయన అద్భుత నటన కనబరిచారు. ఆ తర్వాత వరుసగా తెలుగు సినిమాల్లో నటించాడు. ‘ఆగడు’, రవితేజతో ‘కిక్2’, రామ్ చరణ్ ‘బ్రూస్ లీ’ తదితర చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. టాలీవుడ్‌లో వచ్చిన గుర్తింపుతో ప్రస్తుతం తమిళ్, కన్నడ, మలయాళ చిత్రాల్లోనూ వరుస అవకాశాలు అందుకున్నారు. మరోవైపు పాలిటిక్స్‌లోకి ఎంట్రీ ఇచ్చిన రవి కిషన్.. గత లోకసభ ఎన్నికల్లో ఉత్తర ప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్ నుంచి ఎంపీగా గెలుపొందారు. మరి రవికిషన్ చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.