ఈ మద్య సినీ ఇండస్ట్రీలో వరుస విషాదాలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. సినీ ఇండస్ట్రీకి చెందినవారు.. వారి కుటుంబ సభ్యులు కన్నమూయడంతో విషాద ఛాయలు నెలకొంటున్నాయి. మాలీవుడ్ కి చెందిన ప్రముఖ నటుడు కన్నుమూశారు.
మలయాళ నటుడు బాబూరాజ్ వాజపల్లి ఆదివారం కన్నుమూశారు. ఆయన వయసు 59 సంవత్సరాలు. బాబూరాజ్‌కు ఛాతి నొప్పి రావడంతో ఓమస్సేరిలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. కానీ అప్పటికే ఆయన కన్నుమూసినట్లు వైద్యులు తెలిపారు. బాబురాజ్‌కు భార్య సంధ్య బాబురాజ్, కుమారుడు బిషల్ ఉన్నారు. ఆదివారం మాంగవ్ ప్రభుత్వ శ్మశానవాటికలో అంత్యక్రియలు జరిగాయి.
బాబూరాజ్ ‘త్రిస్సూర్‌లో డ్రామా స్కెచ్’ల ద్వారా కెరీర్ ప్రారంభించాడు. బాబూరాజ్ మలయాళ హిట్ చిత్రాలలో కీలక పాత్రలు పోషించాడు. కేవలం నటుడిగానే కాకుండా పలు చిత్రాలకు ఆర్ట్ డైరెక్టర్, స్క్రీన్ రైటర్ గా పనిచేశారు. బాబురాజ్ ఆకస్మిక మరణం మలయాళ చిత్ర పరిశ్రమను దిగ్భ్రాంతికి గురి చేసింది. ఈ విషయంపై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.