తెలుగు ఇండస్ట్రీలో పోకిరి చిత్రంలో విలన్ గా నటించిన ఆశిష్ విద్యార్థి తర్వాత పలు చిత్రాల్లో విభిన్నమైన పాత్రల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. 1986 లో ఆనంద్ అనే కన్నడ మూవీతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు.
తెలుగు ఇండస్ట్రీలో ఎంతోమంది బాలీవుడ్ నటులు విలన్లుగా ఎంట్రీ ఇచ్చారు. మహేష్ బాబు నటించిన ‘పోకిరి’ మూవీలో విలన్ గా నటించిన ఆశిష్ విద్యార్థి తెలుగు ప్రేక్షకులకు ఎంతగానో చేరువైయ్యారు. పలు భాషల్లో నటుడిగా, ప్రతినాయకుడిగా నటించి తనకంటూ ప్రత్యేక ఇమేజ్ సొంతం చేసుకున్నాడు. నటుడిగానే కాకుండా యూట్యూబర్ గా కూడా ఇటీవల బాగా ఫేమస్ అయ్యారు ఆశిష్ విద్యార్ది. 60 ఏళ్ల వయసులో ఆయన రెండో పెళ్లి వ్యవహారం ఇండస్ట్రీలో అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించింది. తాజాగా ఆశిష్ విద్యార్ది ద్వితీయ వివాహం పై ఆయన మొదటి భార్య స్పందన ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. వివరాల్లోకి వెళితే..
బాలీవుడ్ కి చెందిన ఆశీష్ విద్యార్థి 1986 లో ఆనంద్ అనే కన్నడ మూవీతో సినీ ప్రస్థానం మొదలు పెట్టారు. తెలుగు ఇండస్ట్రీ అన్నవరం, పోకిరి మూవీస్ లో విలన్ గా నటించిన ఆశిష్ విద్యార్ది తర్వాత ఎన్నో చిత్రాల్లో విభిన్న పాత్రలు పోషించి తనకంటూ ప్రత్యేక ఇమేజ్ సొంతం చేసుకున్నారు. దాదాపు 11 భాషల్లో 300 చిత్రాల్లో నటించి జాతీయ ఉత్తమ నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ నెల 25 న గురువారం అసోం కి చెందిన 33 ఏళ్ల ఫ్యాషన్ ఎంటర్‌ప్రెన్యూర్ రూపాలి బారువాను ఆయన రెండో పెళ్లి చేసుకోవడంతో ఇండస్ట్రీ ఒక్కసారే షాక్ కి గురైంది. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. తాజాగా ఆశిష్ విద్యార్థి ద్వితీయ వివాహం పై ఆయన మొదటి భార్య రాజోషి ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టిన పోస్ట్‌లు వైరల్ గా మారాయి.
నవ్వుతున్న సెల్ఫీతో రాజోషి తన ఇన్‌స్టాగ్రామ్‌లో చేసిన పోస్ట్.. ‘ జీవితం అనే పజిల్ లో ఎప్పుడూ గందరగోళానికి గురికావొద్దు’అంటూ రాసుకొచ్చింది. మరో పోస్ట్ లో ‘మీరు మంచి మనసు ఉన్నవారు.. మీరు ఏది చేసినా మిమ్మల్ని ప్రశ్నించను.. మీకు బాధ కలిగించే ఏ పని ఎవరూ చేయరు.. ఇది ఎప్పటికీ మీరు గుర్తుంచుకోండి’ మరో పోస్ట్ లో ‘ఎక్కువగా ఆలోచిస్తూ లేనిపోని సందేహాలు పెట్టుకొవద్దు.. ఇక మీదట మీకు ఆ అవసరం రాకపోవొచ్చు.. ఇప్పుడు వచ్చిన క్లారిటీతో అంతా తుడిచిపెట్టుకుపోయింది.. ఇంతకాలం మీరు స్టాంగ్ గా ఉన్నారు.. ఇప్పుడు అందరి ఆశీర్వాదం తీసుకునే సమయం వచ్చింది, అందుకు నువు అర్హురాలివి’ అంటూ రాసుకొచ్చింది.
ఈ పోస్టులు చూసిన నెటిజన్లు రక రకాలుగా స్పందిస్తున్నారు.. అసలు ఆయన మొదటి భార్య సంతోషంగా ఉందా లేదా? ఆశిష్ విద్యార్థి విడాకులు తీసుకున్న బాధ నుంచి ఆమె ఇంకా కోలుకోలేకపోతున్నారా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరికొంతమంది ఆశిష్ రెండో పెళ్లి విషయంలో మొదటి భార్య రాజ్‌షీ పాజిటీవ్ గానే ఉన్నట్లు కనిపిస్తుందని కొంతమంది తమ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఆశిష్ విద్యార్థికి మొదటి వివాహం నటి శకుంతల బారువా కూతురు.. సింగర్ రాజ్ షీ బారువాతో జరిగింది. వీరికి కొడుకు, కూతురు, అల్లుడు ఉన్నారు. ఇటీవల ఆశిష్, రాజోషికి అభిప్రాయ భేదాల వల్ల విడాకులు తీసుకున్నారు.