పవన్ కల్యాణ్ తో ఉన్న ఈ ఫొటోలో కుర్రాడు ఒకప్పటి చైల్డ్ ఆర్టిస్ట్. అప్పుడు మెగాస్టార్ చిరంజీవి కలిసి యాక్ట్ చేశాడు. ఇప్పుడు ఏకంగా పవర్ స్టార్ తో నటించే బంపర్ ఆఫర్ కొట్టేసినట్లు కనిపిస్తున్నాడు.
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ‘వినోదయ సీతం’ రీమేక్ లో నటిస్తూ బిజీగా ఉన్నారు. #PKSDT వర్కింగ్ టైటిల్ తో తీస్తున్న ఈ మూవీలో పవన్ కు సంబంధించిన టాకీ పార్ట్ రీసెంట్ గా పూర్తయింది. ఈ క్రమంలోనే షూటింగ్ పిక్స్, వీడియోస్ కొన్ని సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ఇందులో పవన్ లుక్ చూసి ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అయిపోతున్నారు. అదే టైంలో ఒకప్పటి చైల్డ్ ఆర్టిస్ట్, పవన్ తో తీసుకున్న ఫొటోలు ఫ్యాన్స్ కి ఆసక్తిని క్రియేట్ చేస్తున్నాయి. అతడు ఎవరా అని ఆరా తీస్తున్నారు. మరి ఈ కుర్రాడు ఎవరనేది కనిపెట్టారా?
ఇక వివరాల్లోకి వెళ్తే.. మీరు స్టాలిన్ సినిమా చూశారా? అంటే ఆల్మోస్ట్ చాలామంది చూసే ఉంటారు అని చెబుతారు. అద్భుతమైన స్టోరీతో తీసిన ఈ మూవీ చిరు కెరీర్ లోనే వన్ ఆఫ్ ది బెస్ట్ గా నిలిచింది. ఇందులో చైల్డ్ ఆర్టిస్ట్ గానూ ఒకబ్బాయి యాక్ట్ చేశారు. హీరోయిన్ త్రిష.. సినిమాలో ఆ పిల్లాడిని చిట్టెలుక అని పిలుస్తూ ఉంటుంది. ఆ పిల్లాడి పేరే అర్మాన్. ప్రస్తుతం సినిమాలు, వెబ్ సిరీసుల్లో నటిస్తున్న అతడు ఇప్పుడు ఏకంగా పవన్ కల్యాణ్ తో కనిపించాడు. దీంతో అతడు ఎవరా అని నెటిజన్స్ సెర్చ్ చేసి తెలుసుకోవడం స్టార్ట్ చేశారు.
పవన్ కల్యాణ్ ‘వినోదయ సీతం’ రీమేక్ లో అర్మాన్ నటిస్తున్నట్లు ఉన్నాడు. అందుకేనేమో షూట్ గ్యాప్ లో పవన్ తో ఫొటోలు తీసుకున్నట్లున్నాడు. అయితే ఇవి అర్మాన్ అకౌంట్ లో ఎక్కడా లేవు గానీ సోషల్ మీడియాలో మాత్రం వైరల్ గా మారాయి. దీన్ని చూసిన పలువురు నెటిజన్స్.. అప్పుడు చిరుతో యాక్ట్ చేశాడు, ఇప్పుడు పవన్ కల్యాణ్ తోనూ యాక్ట్ చేసినట్లు ఉన్నాడని మాట్లాడుకుంటున్నారు. ఏదేమైనాసరే చైల్డ్ ఆర్టిస్టులు చాలా ఫాస్ట్ గా ఎదిగిపోతున్నారు. గుర్తుపట్టలేనంతగా మారిపోతున్నారు. సరే ఇదంతా పక్కనబెడితే ఒకప్పటి ఈ చైల్డ్ ఆర్టిస్ట్ ని మీలో ఎంతమంది గుర్తుపట్టారు? కింద కామెంట్ చేయండి.