తెలుగు ఇండస్ట్రీలో వరుస విజయాలతో దూసుకు పోతున్నాడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. ఇటీవల రిలీజ్ అయిన ‘పుష్ప’ చిత్రంతో ఇప్పుడు పాన్ ఇండియా హీరోగా మారాడు. కేవలం సినిమాలకే పరిమితం కాకుండా యాడ్స్ లో కూడా తన సత్తా చాటుతున్నాడు. పుష్ప బాలీవుడ్ లో వంద కోట్ల క్లబ్ లో చేరటంతో కార్పొరేట్ యాడ్స్ కూడా వస్తున్నాయి. ఇక బ్లాక్ బస్టర్ హిట్స్ తో పాటు వరుస వివాదాల్లో చిక్కుకుంటున్నారు అల్లు అర్జున్. కాకపోతే యాడ్స్ తో హీరోలందరికీ మైలేజ్ వస్తుంటే.. బన్నీ మాత్రం వివాదాల్లో ఇరుక్కుంటున్నాడు. మొన్న ప్రముఖ బైక్ టాక్సీ కంపెనీ రాపిడోకి బ్రాండ్ అంబాసిడర్ గా.. అల్లు అర్జున్ చేసిన యాడ్ తెలుగు పై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి.
ఇక ఈ యాడ్ ఆర్టీసీ సంస్థని కించపరిచేలా ఉందని.. తెలంగాణ ఆర్టీసీ ఎండి సజ్జనార్ మండిపడ్డాడు. బన్నీకి, రాపిడో సంస్థకి క్లాస్ పీకి వెంటనే అభ్యంతరకర దృశ్యాలని తొలగించేలా చేశాడు. తాజాగా బన్నీ జొమాటో ఫుడ్ డెలివరీ యాప్ కోసం ఓ కమర్షియల్ యాడ్ చేశారు. ప్రస్తుతం ఇది నెట్టింట వైరల్ గా మారింది. అల్లు అర్జున్ జొమాటో యాప్ కు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. ఇందు కోసం ఇటీవలే భారీ ఒప్పందం కుదుర్చుకున్న బన్నీ తాజాగా దీని కోసం ఓ టీవీ కమర్షియల్ యాడ్ ని చేశారు. ఈ యాడ్ లో నటుడు సుబ్బరాజు కూడా నటించారు.
ఇక యాడ్ విషయానికి వస్తే.. తనపై ఎటాక్ చేయడానికి వచ్చిన సుబ్బరాజుకి బన్నీ పంచ్ ఇస్తాడు.. ‘సుబ్బరాజు పేపర్లతో సహా గాల్లో తేలుతూ వుంటాడు.. బన్నీ నన్ను కొంచెం తొందరగా కిందపడేయవా.. అని సుబ్బరాజు అడిగితే.. సౌత్ సినిమా కదా ఎక్కువ సేపు ఎగరాలి.. అని బన్నీ అనడం… గోంగూర మటన్ తినాలని వుంది.. కిందకి వచ్చేలోపు రెస్టారెంట్ మూసేస్తారు.. అని సుబ్బరాజు అంటుంటే… గోంగూర మటన్ ఏంటీ ఎప్పుడు ఏది కావాలన్నా జొమాటో వుందిగా.. అంటూ బన్నీ చెప్పిన డైలాగ్ లు సౌత్ సినిమాలపై పంచ్ డైలాగ్ కొడతాడు. ఈ డైలాగ్‌తో సౌత్ ఇండియా సినిమాలను బన్నీ కించపరిచాడంటూ సౌత్ సినీ జనాలు.. సినిమా అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సౌత్ సినిమా ఇండస్ట్రీలో ముఖ్యమైన భాగం టాలీవుడ్ నుంచి స్టార్ హీరోగా ఎదిగిన అల్లు అర్జున్ ఈ డైలాగ్ ఎలా చెప్పగలిగారంటూ మండిపడుతున్నారు. కాగ సౌత్ సినిమాను కించ పరుస్తు బన్నీ డైలాగ్ చెప్పాడని పలువురు కామెంట్స్ పెడుతున్నారు, ట్రోల్స్ చేస్తున్నారు. మొత్తానికి ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.