విహారయాత్రలు అన్నాక చాలా కేర్ ఫుల్ గా ఉండాలి. లేకపోతే ప్రాణాలు ప్రమాదంలో పడిపోతుంటాయి. ఈతకి వెళ్లి నది లేదంటే బీచ్ లో గల్లంతయ్యారు అనే వార్తలు ప్రతిరోజూ మనం చూస్తూనే ఉన్నాయి. అయినా సరే చాలామంది జాగ్రత్త పడటం లేదు. దీంతో ప్రమాదాల్ని కొని తెచ్చుకుంటున్నారు. ఇక ఇప్పుడు కూడా అలాంటి సంఘటనే ఒకటి జరిగింది. టూర్ కి వెళ్లిన ఓ తెలుగులో సముద్రంలో మునిగిపోయాడు. ఈ విషయం కాస్త ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఆ వీడియో కాస్త వైరల్ గానూ మారింది.
ఇక వివరాల్లోకి వెళ్తే.. కర్ణాటకలో గోకర్ణ బీచ్ ఫేమస్ టూరిస్ట్ స్పాట్. ఏడాదిలో ఎప్పటికప్పుడూ ఆ ప్రాంతానికి చిన్నాపెద్దా అనే తేడా లేకుండా వెళ్తుంటారు. ఎంజాయ్ చేస్తుంటారు. ఇక తెలుగులో పలు సినిమాల్లో నటించిన అఖిల్ రాజ్ కూడా తన ఫ్రెండ్స్ తో కలిసి అక్కడికి వెళ్లాడు. కుడ్లే బీచ్ ఏరియాలో ఈత కొట్టేందుకు సముద్రంలో దిగాడు. కానీ అలల తాకిడి ఎక్కువవడంతో నీటిలో కొట్టుకుపోయాడు. దీన్ని గమనించిన రెస్క్యూ టీమ్ అప్రమత్తమయ్యారు. స్పీడ్ బోట్ వేసుకుని.. సముద్రంలో మునిగిపోతున్న నటుడు అఖిల్ రాజ్ ని కాపాడారు. ఒడ్డుకు సురక్షితంగా తీసుకొచ్చారు.
ఇదిలా ఉండగా యూట్యూబ్ లో షార్ట్స్ ఫిల్మ్స్ లో నటించి గుర్తింపు తెచ్చుకున్న అఖిల్, హీరోగా రెండు సినిమాలు చేశాడు. ప్రస్తుతం అనన్య నాగళ్లతో కలిసి ఓ సినిమా చేస్తున్నాడు. ఈ ఏడాది జులైలో అధికారికంగా లాంచ్ అయి, షూటింగ్ కూడా మొదలుపెట్టారు. అంతకు ముందు దేత్తడి హారికతో కలిసి ‘ఏవండోయ్ ఓనర్ గారు’ అనే యూట్యూబ్ వెబ్ సిరీస్ లోనూ నటించి గుర్తింపు తెచ్చుకున్నాడు. మరి సముద్రంలో ఈతకు వెళ్లి నటుడు అఖిల్ మునిగిపోవడంపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో పోస్ట్ చేయండి.