ఇటీవల సినీ ఇండస్ట్రీలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. సినీ తారలు, వారి బంధువులు కన్నుమూయడంతో వారి కుటుంంబ సభ్యులే కాదు.. అభిమానులు సైతం విషాదంలో మునిగిపోతున్నారు.
ఇటీవల సినీ ఇండస్ట్రీలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. సినీ నటులు, వారి కుటుంబ సభ్యులు కన్నుమూస్తున్నారు. తెలుగు, తమిళ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా తనకంటూ ప్రత్యేక ఇమేజ్ సొంతం చేసుకున్న హీరో అజిత్ కుమార్. ఇక తెలుగు ఇండస్ట్రీలో కెరీర్ ప్రారంభించినప్పటికీ తమిళ నాట మంచి సక్సెస్ లు సాధించిన అజిత్ కుమార్ అక్కడే స్థిరపడ్డారు. తాజాగా అజిత్ కుమార్ ఇంట విషాదం చోటు చేసుకుంది. ఆయన తండ్రి పి. సుబ్రమణ్యం కన్నుమూశారు. వివరాల్లోకి వెళితే..
స్టార్ హీరో అజిత్ కుమార్ ఇంట తీవ్ర విషాదం నెలకొంది. ఆయన తండ్రి పి. సుబ్రమణ్యం చైన్నైలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో కన్నుమూశారు. ఆయన వయసు 86 సంవత్సరాలు. గత కొంత కాలంగా సుబ్రమణ్యం అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈ క్రమంలో ఆయనను చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు అజిత్ కుటుంబ సభ్యులు. ఈ క్రమంలోనే ఆయన ఆరోగ్యం పూర్తిగా విషమించి తుది శ్వాస విడిచారు. తండ్రి మరణంతో అజిత్ కుటుంబ సభ్యులో శోకసంద్రంలో మునిగిపోయారు. హీరో అజిత్ తండ్రి పి. సుబ్రమణియం మృతి పట్ల సినా ప్రముఖులు తీవ్ర దిగ్భ్రంతి వ్యక్తం చేస్తూ ఆయనకు, కుటుంబ సభ్యులకు సంతాపాన్ని తెలుపుతున్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని మీడియా వేధికగా నివాళులర్పిస్తున్నారు. ఈ రోజు సాయంత్రం చెన్నైలో బీసెంట్ నగర్ స్మశాన వాటికలో అంత్యక్రియలు జరగనున్నట్లు అజిత్ కుటుంబ సభ్యులు తెలిపారు.
హైదరాబాద్.. సికింద్రాబాద్ లో పుట్టి పెరిగిన అజిత్ కుమార్ కెరీర్ బిగినింగ్ లో ఓ బైక్ మెకానిక్ గా కొనసాగారు. ఆ తర్వాత గొల్లపూడి మారుతీరావు తనయుడు గొల్లపూడి శ్రీనివాస్ దర్శకత్వంలో ‘ప్రేమ పుస్తకం’ చిత్రంతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు. ఈ చిత్రం పెద్దగా సక్సెస్ కాలేదు.. ఆ తర్వాత తమిళ నాటు అడుగు పెట్టిన అజిత్ అక్కడ వరుస విజయాలతో మస్ హీరోగా మంచి ఇమేజ్ సంపాదించారు. ఇటీవల తెగింపు చిత్రంతో మంచి విజయం అందుకున్నాడు అజిత్.
நடிகர் அஜித்குமாரின் தந்தை சுப்ரமணியம் (84) காலமானார்!#SunNews | #AjithKumar | #Subramaniam pic.twitter.com/rr6LQJDDKj
— Sun News (@sunnewstamil) March 24, 2023