యాక్షన్ కింగ్ అర్జున్ ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. అర్జున్ మాతృమూర్తి లక్ష్మీ దేవమ్మ(85) కన్నుమూశారు. బెంగళూరు అపోలో ఆస్పత్రిలో ఆవిడ తుదిశ్వాస విడిచారు. అయితే మృతికి గల కారణాలు మాత్రం తెలియాల్సి ఉంది. లక్ష్మీ దేవమ్మ మోసూరులోని ఓ స్కూల్ లో టీచర్ గా పనిచేశారు. ఆవిడకు ఇద్దరు కుమారులు, ఓ కుమార్తె ఉన్నారు.
యాక్షన్ కింగ్ గా అర్జున్ తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితుడే. టాలీవుడ్ లోనూ అర్జున్‌కు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అర్జున్ కుమార్తెను హీరోయిన్ గా పెట్టి విశ్వక్ సేన్‌తో సినిమా డైరెక్ట్ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ వార్త వినగానే అటు శాండిల్ వుడ్, ఇటు టాలీవుడ్ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అర్జున్ తల్లి మృతిపై టాలీవుడ్ ప్రముఖులు సంతాపం తెలియజేశారు.