తెలుగు ఇండస్ట్రీలో వరుణ్ తేజ్ నటించిన ‘ముకుంద’ చిత్రంతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది పూజా హెగ్డే. ఆ తర్వాత నాగ చైతన్య హీరోగా నటించిన ఒక లైలా కోసం చిత్రంలో నటించింది. ఈ రెండు చిత్రాల్లో పూజా హెగ్డే చాలా సాంప్రదాయ లుక్ తో కనిపించింది. పూజా హెగ్డే నటించిన ఈ రెండు చిత్రాలు పెద్దగా హిట్ టాక్ తెచ్చుకోలేదు.
హరీష్ శంకర్ దర్శకత్వంలో అల్లు అర్జున్ నటించిన ‘దువ్వాడజగన్నాథం’ చిత్రంలో పూజా హెగ్డే బికినీతో కుర్రాళ్ల మతులు పోగొట్టింది. ఈ చిత్రం తర్వాత తెలుగు లో వరుసగా ఛాన్సులు దక్కించుకుంది. ప్రస్తుతం ఈ అమ్మడు ప్రభాస్ తో రాధేశ్యామ్., అఖిల్ తో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్, రామ్ చరణ్ తో ‘ఆచార్య’ చిత్రంలో నటించింది. టాలీవుడ్ బుట్టబొమ్మ పూజా హేగ్దే పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆచార్య టీం ఆమె లుక్ ని రిలీజ్ చేసింది. ఈ సినిమాలో నీలంబరి అనే పాత్రలో నటిస్తున్నట్టుగా వెల్లడించింది.
ఈ లుక్ లో పూజా పదహారణాల తెలుగు అమ్మాయి లాగా సాంప్రదాయకంగా కనిపిస్తుంది. సురేఖ కొణిదెల సమర్పణలో కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, మ్యాట్నీ ఎంటర్ టైన్ మెంట్స్ పతకాలపై ఈ చిత్రం నిర్మితమవుతోంది. రాంచరణ్ ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు. కాజల్ అగర్వాల్, పూజ హెగ్డేలు ఈ సినిమాలో కథానాయికలుగా మెరవబోతున్నారు. ఇప్పటికే ఈ సినిమా టీజర్, సాంగ్ కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఈ చిత్రంపై ఎన్నో అంచనాలు నెలకొన్నాయి.
Wishing our elegant #Neelambari aka @hegdepooja a very Happy Birthday ♥️#AcharyaOnFeb4th#Acharya
Megastar @KChiruTweets @AlwaysRamCharan #SivaKoratala @MsKajalAggarwal #ManiSharma @DOP_Tirru @sureshsrajan @NavinNooli #NiranjanReddy @MatineeEnt @KonidelaPro @adityamusic pic.twitter.com/hXNSbWPsMe
— Konidela Pro Company (@KonidelaPro) October 13, 2021