మెగాఫ్యాన్స్ ఎంతో ఆసక్తికరంగా ఎదురుచూసిన ‘ఆచార్య’ మూవీ ఎట్టకేలకు థియేటర్లోకి వచ్చేసింది. మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రాంచరణ్ ప్రధాన పాత్రలలో నటించిన ఈ సినిమా.. భారీ అంచనాల నడుమ విడుదలై విజయవంతంగా థియేటర్లలో ప్రదర్శించబడుతోంది. అగ్రదర్శకుడు కొరటాల శివ ఈ మెగా మూవీని తెరకెక్కించగా.. మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ వారు చిత్రాన్ని నిర్మించారు. ఆచార్యలో చిరు – చరణ్ లను ఒకేసారి చూసేసరికి మెగాఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు.
ఈ క్రమంలో ఆచార్య సినిమా ఓటిటి రిలీజ్ అంటూ సోషల్ మీడియాలో పలు కథనాలు ట్రెండ్ అవుతున్నాయి. తాజా సమాచారం ప్రకారం.. ఈ మోస్ట్ అవైటెడ్ మెగా మూవీ ఓటిటి హక్కులను ‘అమెజాన్ ప్రైమ్’ కొనుగోలు చేసినట్లు తెలుస్తుంది. అలాగే థియేటర్లలో రన్ అవుతున్న ఈ సినిమా ఊపు తగ్గకముందే.. అంటే విడుదలైన నాలుగు వారాలకే ఓటిటి రిలీజ్ చేయాలని అమెజాన్ ప్రైమ్ వారు ఆలోచిస్తున్నారని టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి.
మరి ఆచార్య ఈ శుక్రవారమే విడుదలైంది కాబట్టి.. ఓటిటి రిలీజ్ పై మేకర్స్ అయితే ఇంకా స్పందించలేదు. ప్రస్తుతానికి ఊహాగానాలుగా వైరల్ అవుతున్న ఆచార్య ఓటిటి రిలీజ్ పై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఇక ఈ మెగా మూవీలో పూజాహెగ్డే కీలకపాత్ర పోషించగా.. రెజీనా స్పెషల్ సాంగ్ లో ఆడిపాడింది. దాదాపు పన్నెండేళ్ల తర్వాత మెగాస్టార్ మూవీకి మణిశర్మ సంగీతం అందించారు. మరి ఆచార్య మూవీపై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.