మెగాస్టార్ చిరంజీవి.. ఈ పేరుకున్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ఆ పేరు వినబడితే చాలు అభిమానుల్లో కొత్త ఉత్సాహం. పునాది రాళ్లు సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయ్యారు చిరంజీవి. అప్పటి నుంచి అందివచ్చని ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ.. నటనలో తనకు తాను మెరుగులు దిద్దుకుంటూ.. నిరంతరం శ్రమిస్తూ.. నేడు మన ముందు సూపర్ స్టార్‌గా నిలిచారు. ఇండస్ట్రీలోకి రావాలనుకునే ప్రతి సామాన్యుడికి ఆయనే రోల్ మోడల్. 1978లో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన చిరంజీవి.. క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా, సుప్రీం హీరోగా.. ఇప్పుడు మెగాస్టార్‌గా ఎదిగారు. ప్రస్తుతం ఆయన కొరటాల శివ దర్శకత్వంలో, తన కుమారుడు రామ్ చరణ్‌తో కలిసి.. ఆచార్యగా ప్రేక్షకులు ముందుకు రానున్నారు. ఏప్రిల్ 29 న విడుదల కాబోయే ఈ చిత్రం కోసం అభిమానులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ప్రస్తుంత చిత్ర బృందం ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉంది. ఈ నేపథ్యంలో దర్శకుడు హరీష్ శంకర్.. ఆచార్య టీమ్‌తో చిట్‌చాట్ నిర్వహించాడు.
ఇది కూడా చదవండి: చరణ్ కాబట్టి రిస్క్ తీసుకున్నాడు.. నేనైతే వద్దనే వాడ్ని: చిరంజీవి
ఈ క్రమంలో హరీష్ శంకర్ కొండవీటి దొంగ చిత్రంలోని శుభలేఖ రాసుకున్న పాటలోని ఓ సీన్ గురించి ప్రస్తావిస్తాడు. ఆ సన్నివేశంలో రాధ కెమరా ఎదురుగా ఉంటారు. మీ బ్యాక్ మాత్రమే కెమరాకు కనిపిస్తుంది. అలాంటి సీన్‌లో మీరు కాలర్ ఎగరేసి.. రాధ వైపు ఉన్న ప్రేక్షకుల అటెన్షన్‌ని మీవైపు తిప్పుకున్నారు. దాన్ని డామినేట్ చేయడం లేక మీ ఉనికి చాటుకోవడమా ఏదైనా అనొచ్చు. ఇప్పుడు ఆచార్య సినిమాలో కూడా రామ్ చరణ్‌తో నటించేటప్పుడు అలానే చేశారా.. ప్రేక్షకుల అటెన్షన్‌ను గ్రాబ్ చేయాలని ఏమైనా చేశారా అని ప్రశ్నించాడు.
ఇది కూడా చదవండి: ‘ఆచార్య’లో రామ్ చరణ్ బదులు పవన్ కళ్యాణ్.. చిరు ఏమన్నాడంటే!
అందుకు చిరంజీవి బదులిస్తూ.. ఆలాంటి ఎక్స్‌ట్రాలు ఎప్పుడు చేయనని తెలిపి.. తనకు గతంలో ఎదురైన ఓ అనుభవాన్ని వివరించారు. చిరంజీవి తొలి చిత్రం పునాదిరాళ్లు షూటింగ్ సమయంలో జరిగిన అనుభవాన్ని వివరించారు. ఆ రోజు తాను చేసిన ఓ చిన్న ప్రయోగం.. పునాది రాళ్ల చిత్రం దర్శకుడికి బాగా నచ్చిందన్నారు. తాను చేసిన పనిని ప్రశంసించారని.. అది చాలా మంచి లక్షణం అని.. ఇలానే కొనసాగించాలని సూచించారని తెలిపారు. ఆరోజు నుంచి పాత్ర పరిధి మేరకు మన ఆటిట్యూడ్ కనిపించేలా చేయగలిగితే చాలని ఫిక్సయ్యానని. అప్పటి నుంచి తాను ఇదే ఫాలో అవుతున్నానని తెలిపారు. ‘‘ఇక ఇప్పుడు ఆచార్య సినిమాలో మా తండ్రికొడుకుల అనుబంధం ప్రతి సీన్‌లో కనిపిస్తుంది. దర్శకుడి అంచనాల మేరకు.. తనకు ఏం కావాలో అదే ఇచ్చాం’’ అని చిరంజీవి తెలిపాడు. ప్రస్తుతం ఈ ఇంటర్వ్యూ వీడియో వైరలవుతోంది. మరి చిరంజీవి వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
ఇది కూడా చదవండి: ఆచార్య టికెట్స్ హైక్! లైవ్ లోనే సీరియస్ అయిన చిరంజీవి!
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.