మెగా స్టార్ చిరంజీవి, ఆయన తనయుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఇద్దరు కలిసి నటిస్తున్న చిత్రం ఆచార్య. ఏప్రిల్ 29న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది ఆచార్య. ఇప్పటికే చిత్ర బృందం ప్రమోషన్ కార్యక్రమాలతో ఫుల్ బిజీగా ఉంది. హైదరాబాద్‌లో సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ గ్రాండ్‌గా జరిపారు చిత్ర బృందం. ఇక సెన్సార్ రివ్యూలో ఆచార్యకు సూపర్ హిట్ టాక్ వచ్చింది. దాంతో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. సినిమా కోసం మెగా అభిమానులు ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు.
ఇక ఏప్రిల్ 29న విడుదలకు సిద్ధమవుతున్న ఆచార్య సినిమాకు సంబంధించి రెండు తెలుగు ప్రభుత్వాలు టికెట్ ధరల పెంపుకు అనుమతిస్తూ.. గుడ్ న్యూస్ చెప్పిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో మంగళవారం నిర్వహించిన ఆచార్య ప్రెస్‌మీట్‌లో ఓ వ్యక్తి సినిమా టికెట్ ధరల పెంపుపై ప్రశ్నించాడు. మెగాస్టార్ చిరంజీవి సినిమా అంటేనే హౌజ్‌ఫుల్ అవుతుంది. అలాంటిది చిరంజీవి సినిమాకు కూడా టికెట్ రేట్లు పెంచాల్సిన అవసరం ఏంటి అని ప్రశ్నించాడు.
ఇది కూడా చదవండి: చరణ్ కాబట్టి రిస్క్ తీసుకున్నాడు.. నేనైతే వద్దనే వాడ్ని: చిరంజీవి
ఇందుకు మొదట దర్శకుడు కొరటాల శివ స్పందించాడు. ‘‘మీరు ఒకసారి ఆఫీస్‌కు వస్తే లెక్కలు చెబుతాం. ఈ సినిమా కోసం చిరంజీవి, చరణ్ మూడు సంవత్సరాలుగా పని చేస్తున్నారు. నేను 4 సంవత్సరాలుగా వేరే సినిమా చేయలేదు. మేం ఇంకా డబ్బులు తీసుకోలేదు. సినిమాకు బడ్జెట్ ఏంటి.. ఈ సినిమాకు ఎంత ఖర్చయ్యిందో మీకు చెబుతాను. ఆ లెక్కలు కూడా ఇంకా చూడలేదు. మా సినిమాకు, త్రిబుల్ ఆర్ సినిమాకు ఎంత ఖర్చయ్యింది.. మేం టికెట్ రేటు ఎంత పెంచామో మీరే చూడండి’’ అని సమాధానం ఇచ్చాడు.
ఇది కూడా చదవండి: నా కొడుకు సత్తా ఉన్న నటుడు : చిరంజీవి
ఆ వెంటనే చిరంజీవి స్పందించారు. ఇండస్ట్రీలో ఉండే కష్టాలు.. వారు ఎదుర్కొనే సమస్యల గురించి వివరిస్తూ.. ఎందుకు సినిమా టికెట్ ధరలు పెంచాల్సి వచ్చిందో వివరించారు. చిరంజీవి మాట్లాడుతూ.. ‘‘మహమ్మారి సమయంలో ప్రతి రంగం కుదేలయ్యింది. కుంటుపడినప్పుడు.. మాస్టార్ కాస్త నాకు చేయూతనిస్తారా అంటే మీరు ఇవ్వరా.. 50 కోట్ల రూపాయలు ఇంట్రెస్ట్ కట్టడం గురించి మీరు ఎప్పుడైనా విన్నారా. కానీ మేం కట్టాం. ఎవరిస్తారు చెప్పండి. ప్రభుత్వాలు మా పరిస్థితి అర్థం చేసుకుని జీవోలిస్తే.. ప్రేక్షకులు కూడా.. అరే వీళ్లు మాకు ఇంత వినోదం ఇచ్చారు.. మనం కూడా ఇద్దామని.. ఓ పది రూపాయలు ఇస్తారు. అలా అందరూ ముందుకు వచ్చారు. ఇది అడుక్కోవడం కాదు’’ అన్నారు.
ఇది కూడా చదవండి: చిరుపై సీనియర్ హీరోయిన్ రాధిక ఇంట్రెస్టింగ్ కామెంట్స్!
‘‘అవసరంలో ఉన్నారు.. ఖర్చు పెట్టారు. ప్రేక్షకులకు వినోదం ఇద్దామని భారీ బడ్జెట్ స్పెండ్ చేశారు. అనుకోని పరిస్థితుల్లో అంతకంతకు వడ్డీలు పెరిగి ఓ మాదిరి మీడియేటర్ సినిమాకు అయినంత ఖర్చు అయ్చింది. దీన్ని ఎవరు ఊహించలేదు. కరోనా సమయంలో ప్రపంచవ్యాప్తంగా అందరు నష్టపోయారు. దానిలో మేం కూడా ఉన్నాం. దీని గురించి ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేయడం తప్పు కాదు. సమాజంలో ఎక్కువ పన్ను కడుతుంది మేమే. 42 శాతం పన్నులు మా దగ్గర నుంచే వస్తున్నాయి. అందులో కొంత మాకు ఇవ్వమని అడగడం తప్పు కాదు. మా హక్కు. ఇది న్యాయమే’’ అంటూ చిరంజీవి ఎంతో ఎమోషనల్‌గా చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఆయన మాటలు నెట్టింట వైరల్‌గా మారుతున్నాయి. మరి చిరంజీవి వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.