ప్రస్తుతం తెలుగు సినీ ప్రేక్షకులు అందరూ ఆతృతగా ఎదురు చూస్తున్న చిత్రం ఆచార్య. మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కాంబినేషన్‌లో తెరకెక్కిన ఈ చిత్రం ఏప్రిల్ 29న విడుదల కానుంది. ఇప్పటికే చిత్రం బృందం ప్రీరిలీజ్ ఈవెంట్, ప్రమోషన్ కార్యక్రమాలతో సినిమాపై అంచనాలను ఓ రేంజ్‌లో పెంచుతున్నారు. ఇక ఇద్దరు సూపర్‌స్టార్లను ఒకేసారి తెర మీద ఎప్పుడెప్పుడు చూద్దామా అని ప్రేక్షకులు ఆత్రంగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ చిత్రానికి U/A సర్టిఫికెట్ లభించింది.
అయితే,.. ఈ సినిమా రివ్యూను ట్విట్టర్ వేదికగా చెప్పేశారు ప్రముఖ క్రిటిక్ ఉమైర్ సంధు. ఈ సందర్భంగా సినిమాకు 4 స్టార్ రేటింగ్ ఇచ్చిన సంధు.. చిరంజీవి, రామ్ చరణ్ పై ప్రశంసల జల్లు కురిపించారు. ఆచార్య సినిమా మాస్ ప్రేక్షకులకు పుల్ మసాలా అందించే సినిమా అని.. చిరు, చరణ్ తమ నటనతో ఇరగదీశారని ఆయన చెప్పుకొచ్చారు. ఈ రివ్యూ పట్ల మెగా ఫ్యాన్స్ జోష్ లో ఉన్నారు. ఈ సినిమా ఖచ్చితంగా మెగా అభిమానులకు పుల్ మీల్స్ ను అందిస్తుందని రివ్యూ చూస్తే అర్థమవుతుంది.
First Review #Acharya ! It has Deadly Combo of #RamCharan, and #Chiranjeevi + Entertainment in large doses.The film has the masala to work big time with the masses. This one will rewrite the rules of the game and the festive occasion [#EID ] will aid its potential. ⭐⭐⭐⭐ pic.twitter.com/f2YMNxc4Tv
— Umair Sandhu (@UmairSandu) April 26, 2022
ఇది కూడా చదవండి: ‘ఆచార్య’లో రామ్ చరణ్ బదులు పవన్ కళ్యాణ్.. చిరు ఏమన్నాడంటే!