మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రధాన పాత్రలలో నటించిన చిత్రం ‘ఆచార్య’. ప్రస్తుతం విజయవంతంగా థియేటర్లలో ప్రదర్శితం అవుతున్న ఈ సినిమాను దర్శకుడు కొరటాల శివ తెరకెక్కించారు. అయితే..ఓవైపు థియేటర్ల వద్ద ఆచార్య హవా కొనసాగుతుండగా.. మరోవైపు ఆచార్యలో నటించిన ఓ బాలనటుడి గురించి సినీవర్గాలలో చర్చలు జరుగుతున్నాయి. మరి ఇంతకీ ఆచార్యలో నటించిన ఆ బాలుడు ఎవరు? అతని బ్యాక్ గ్రౌండ్ ఏంటి? అనే వివరాల్లోకి వెళ్తే..
ఆచార్య సినిమాలో మిథున్ అనే బాలుడు నటించి చైల్డ్ ఆర్టిస్టుగా మెప్పించాడు. మందమర్రికి చెందిన శ్రీధర్, సరిత దంపతుల కుమారుడు మిథున్ శ్రేయాష్. హైదరాబాద్ లోని రామంతాపూర్ లో వీరు ప్రస్తుతం ఉంటున్నారు. సెయింట్ జోసెఫ్ హైస్కూల్ లో ఐదో తరగతి చదువుతున్నాడు మిథున్.
ఇక ఆచార్య సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ కోసం ఆడిషన్స్ జరుగుతుండగా.. మిథున్ తండ్రి శ్రీధర్ కి, విజయ్ కుమార్ అనే స్నేహితుని ద్వారా సినిమావాళ్లు పరిచయమయ్యారట. ఆడిషన్ లో మిథున్ డైలాగ్స్ బాగా చెప్పడంతో సినిమాలో సెలెక్ట్ అయ్యాడు. అనంతరం రాజమండ్రి, కోకాపేట ఏరియాలో జరిగిన షూటింగ్ లో పాల్గొన్నాడు మిథున్. ఇక చిరంజీవి సినిమాలో తమ మనవడు నటించడం సంతోషంగా ఉందని మిథున్ తల్లిదండ్రులు, తాత డాక్టర్ డాక్టర్ భీమనాథుని సదానందం ఆనందం వ్యక్తం చేశారు. మరి ఆచార్య మూవీపై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.