టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి, తనయుడు మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ప్రధాన పాత్రలలో నటించిన సినిమా ‘ఆచార్య’. దర్శకుడు కొరటాల శివ తెరకెక్కించిన ఈ సినిమా.. భారీ అంచనాల మధ్య గత శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చింది. అయితే.. ఆచార్య విడుదలైన మొదటిరోజు నుండే డివైడెడ్ టాక్ తెచ్చుకోవడంతో.. ఆ ప్రభావం సినిమా కలెక్షన్స్ పై భారీస్థాయిలో రిఫ్లెక్ట్ అయినట్లు తెలుస్తుంది.
ఆచార్య మూవీని కొణిదెల ప్రొడక్షన్స్ – మ్యాట్నీ ఎంటర్టైన్ మెంట్ సంస్థలు సంయుక్తంగా నిర్మించాయి. ఈ సినిమాలో స్టార్ హీరోయిన్ పూజాహెగ్డే కీలకపాత్రలో నటించింది. ఇక భారీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో రిలీజైన ఈ మెగా మూవీ.. కలెక్షన్స్ పరంగా వెనకబడినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. అసలు ఆచార్య బ్రేక్ ఈవెంట్ టార్గెట్ ఎంత? మొదటి మూడు రోజుల్లో ఎంత వసూల్ చేసిందో ఇప్పుడు చూద్దాం.
నైజాం – రూ. 11.56 కోట్లు
సీడెడ్ – రూ. 5.87 కోట్లు
ఉత్తరాంధ్ర – రూ. 4.68 కోట్లు
ఈస్ట్ – రూ. 3.18 కోట్లు
వెస్ట్ – రూ. 3.27కోట్లు
గుంటూరు – రూ. 4.52 కోట్లు
కృష్ణా – రూ. 2.84 కోట్లు
నెల్లూరు – రూ. 2.80 కోట్లు
రెండు తెలుగు రాష్ట్రాలలో రూ. 38.72 కోట్లు షేర్ రాబట్టగా.. కర్ణాటక, రెస్టాఫ్ ఇండియాలో రూ.2.45 కోట్లు, ఓవర్సీస్ లో రూ.4.35 కోట్లు వసూల్ చేసింది. మూడు రోజులకు కలిపి ఆచార్య రూ. 45.52 కోట్లు షేర్ సాధించిందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఇక గ్రాస్ పరంగా చూస్తే రూ. 70.65 కోట్లు రాబట్టింది. అయితే.. ఆచార్య బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 135 కోట్లు అని తెలుస్తుంది. ఈ క్రమంలో ఆచార్య ఇంకా దాదాపు 90 కోట్లు వసూల్ చేయాల్సి ఉందని సమాచారం. మరి ఆచార్య సినిమాపై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.
#Acharya 1st Weekend Total WW Collectionshttps://t.co/OrWwmid2TI
Towards Double Disaster! pic.twitter.com/tOnKayBM3p
— AndhraBoxOffice.Com (@AndhraBoxOffice) May 2, 2022