సెలబ్రిటీల వ్యక్తిగత విషయాల గురించి తెలుసుకోవడంలో ఫ్యాన్స్ ఎప్పుడూ ఆసక్తికరంగానే ఉంటారు. ముఖ్యంగా స్పెషల్ డేస్ ఏమైనా ఉంటే.. సెలబ్రిటీలు ఏమేం పోస్ట్ చేస్తారా అని వెయిట్ చేస్తుంటారు. తాజాగా ఆట ఫేమ్ సందీప్ తన భార్య జ్యోతిరాజ్ కి ఓ సర్ప్రైజింగ్ గిఫ్ట్ ఇచ్చి సంతోషపెట్టాడు. 9 ఏళ్ళ దాంపత్యానికి గుర్తుగా తన భార్య జ్యోతికి చాలా ఇష్టమైన, వెలకట్టలేని బహుమానం ఇచ్చినట్లు పోస్టులో తెలిపాడు.
వివరాల్లోకి వెళ్తే.. కొరియోగ్రఫర్ ఆట సందీప్, అతని భార్య జ్యోతిరాజ్ సోషల్ మీడియాలో అదిరిపోయే స్టెప్పులతో ఎంత సందడి చేస్తారో అందరికి తెలిసిందే. గతంలో టిక్ టాక్ లో కూడా ఈ జంట ఊపేసింది. ఇప్పుడు ఇన్ స్టాగ్రామ్ రీల్స్, యూట్యూబ్ వీడియోాలతో ఆకట్టుకుంటున్నారు. ఇటు సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉంటూనే సామాజిక సేవా కార్యక్రమాలలో కూడా చురుకుగా పాల్గొంటుంటారు. తాజాగా పెళ్ళై 9 ఏళ్ళు అయిన సందర్బంగా భార్యకి మర్చిపోలేని గిఫ్ట్ ఇచ్చాడు.
భర్త ఇచ్చిన బహుమతి చూసి జ్యోతిరాజ్ ఎమోషనల్ అయ్యింది. గిఫ్ట్ బాక్స్ లో నుండి కాలి గజ్జెలను తీసి భార్య పాదాలకు తొడిగాడు. ఆ తర్వాత జ్యోతి నాట్యం చేసి భర్తను గట్టిగా ఆలింగనం చేసుకుంది. నాట్యమంటే మక్కువ ఉన్నవారికి కాలి అందెలే వెలకట్టలేవి. ఆ విధంగా ఆట సందీప్ తన భార్యకు అందెలను బహుమతిగా ఇచ్చాడు. ప్రస్తుతం ఆ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఆట సందీప్, జ్యోతి రాజ్‌ఇద్దరూ లవ్ మ్యారేజ్ చేసుకున్న విషయం విదితమే. మరి ఆట సందీప్ – జ్యోతిరాజ్ లపై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.