ఫిల్మ్ డెస్క్- తెలగు సినీ పరిశ్రమలో యంగ్ టాలెంట్ ను మెగాస్టార్ చిరంజీవి ఎంతగానో ప్రోత్సహిస్తారనేది అందిరికి తెలిసిందే. ప్రధానంగా డ్యాన్స్ అంటే ఇష్టపడే చిరంజీవి ఎంతో మంది డ్యాన్సర్స్ ను ఎంకరేజ్ చేశారు. లారెన్స్ లాంటి కొరియోగ్రాఫర్స్ చిరంజీవి ప్రోత్సాహం వల్లే పైకి వచ్చారు. ఇక చిరంజీవి వీరాభిమాని అయిన ప్రముఖ కొరియోగ్రాఫర్ ఆట సందీప్ తన భార్య జ్యోతి రాజ్‌తో కలిసి చిరంజీవి బర్త్ డేకు స్పెషల్‌గా రాబోతోన్నారు.
గత సంవత్సరం మెగాస్టార్ పుట్టిన రోజు సందర్బంగా చిరు పాట సందెపొద్దుల కాడ సంపెంగ అంటూ తన భార్యతో కలిసి సుధాకర్ డ్యాన్స్ చేసి శభాష్ అనిపించుకున్నారు. ఆ వీడియోను చూసి చిరంజీవి ఎంతో ముచ్చటపడ్డారు. ఆ గ్రేస్, ఆ మూమెంట్స్ అన్నీ బాగున్నాయంటూ ఆ దంపతులను మెగాస్టార్ అభినందించారు. ఇదిగో ఇప్పుడు మళ్లీ ఆగష్టు 22 చిరంజీవి బర్త్ డే నేపధ్యంలో ఆట సందీప్ చిరు పాటకు డ్యాన్స్ తో మన ముందుకు వస్తున్నారు.
చిరంజీవి బర్త్ డేకు ఆట సందీప్ తన ప్రేమను చాటేందుకు రెడీ అయ్యారు. చిరంజీవి మాస్ స్టెప్పులను మరోసారి గుర్తు చేస్తూ ఆట సందీప్ మన ముందుకు వస్తున్నారు. కోడి కూర చిల్లి గారె పాటకు ఆట సందీప్, తన భార్య జ్యోతి రాజ్ తో ఇరగదీశాడు. ఈ పాటకు సంబందించిన ప్రోమో ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మరి ఫుల్ సాంగ్ ఎలా ఉంటుందో.. ఈ పాటపై మెగాస్టార్ చిరంజీవి ఎలా స్పందిస్తారో చూడాలి.